దేవరయాంజల్ భూములపై కొనసాగుతున్న విచారణ..
దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా, శామీర్ పేట మండలంలోని దేవరయాంజల్ ఆలయ భూములపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. మంగళవారం ప్రభుత్వం నియమించిన కమిటీలోని నలుగురు ఐఏఎస్ అధికారులతో పాటు అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. కాగా, ఈ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి గ్రామంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. మాజీ మంత్రి ఈటల, కుటుంబ సభ్యులకు చెందిన శెడ్లను […]
దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా, శామీర్ పేట మండలంలోని దేవరయాంజల్ ఆలయ భూములపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. మంగళవారం ప్రభుత్వం నియమించిన కమిటీలోని నలుగురు ఐఏఎస్ అధికారులతో పాటు అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. కాగా, ఈ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి గ్రామంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. మాజీ మంత్రి ఈటల, కుటుంబ సభ్యులకు చెందిన శెడ్లను కమిటీలోని సభ్యులు రఘునందన్ రావు, ప్రశాంత్ జీవన్, భారతి హోలికేరి, శ్వేతా మహంతీలు పరిశీలించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఇతరులు భూములు అక్రమించారన్న ఫిర్యాదులపై, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఆఘమేఘాల మీద దేవరయాంజల్‌లోని ఆలయ భూములకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.