వన్ ప్లస్ నుంచి బడ్జెట్ స్మార్ట్ టీవీలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ చైనా కంపెనీ ‘వన్ ప్లస్’ బడ్జెట్ రేంజ్ టీవీలను శుక్రవారం ఇండియాలో లాంచ్ చేసింది. వీటిని వై, యూ సిరీస్‌ల్లో తీసుకొచ్చింది. వన్ ప్లస్ కొత్త టీవీల సేల్ జులై 5వ తేదీ నుంచి అమెజాన్‌లో జరగనుంది. ఇవి త్వరలో వన్ ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్‌లో కూడా లభించనున్నాయి. ఈ టీవీలన్నీ ఆండ్రాయిడ్ టీవీ 9 Pie ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనున్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్రోమ్ కాస్ట్, గూగుల్ ప్లేస్టోర్ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ చైనా కంపెనీ ‘వన్ ప్లస్’ బడ్జెట్ రేంజ్ టీవీలను శుక్రవారం ఇండియాలో లాంచ్ చేసింది. వీటిని వై, యూ సిరీస్‌ల్లో తీసుకొచ్చింది. వన్ ప్లస్ కొత్త టీవీల సేల్ జులై 5వ తేదీ నుంచి అమెజాన్‌లో జరగనుంది. ఇవి త్వరలో వన్ ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్‌లో కూడా లభించనున్నాయి. ఈ టీవీలన్నీ ఆండ్రాయిడ్ టీవీ 9 Pie ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనున్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్రోమ్ కాస్ట్, గూగుల్ ప్లేస్టోర్ వంటి ఫీచర్లకు యాక్సెస్ అవకాశం కూడా ఉంది. గేమ్స్, యాప్స్‌ను వీటి ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రస్తుతం యాంటీ చైనా సెంటిమెంట్ వల్ల.. చైనా ప్రొడక్ట్స్‌పై ఇండియన్స్‌లో వ్యతిరేకత ఉండటంతో వన్ ప్లస్ కంపెనీ దానిపై క్లారిటీ ఇచ్చింది. వన్‌ప్లస్ 8 సిరీస్‌తో సహా పలు వన్‌ప్లస్ ఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తున్నట్లు చెప్పింది. ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
వన్ ప్లస్ వై-సిరీస్ టీవీలు 32, 43 అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 32 అంగుళాల టీవీలో హెచ్‌డీ స్క్రీన్‌ను అందిస్తుండగా, 43 అంగుళాల టీవీలో ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను అందిస్తోంది. యూ-సిరీస్ టీవీలో 55 అంగుళాల తెర, 4కే ఎల్ఈడీ స్క్రీన్‌ను అందిస్తున్నారు. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ ఫార్మాట్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని స్పెసిఫికేషన్లన్నీ దాదాపు వన్ ప్లస్ టీవీ క్యూ1, క్యూ1 ప్రోల తరహాలోనే ఉన్నాయి.
వై-సిరీస్ 32 ఇంచుల టీవీ ధర – రూ.12,999/-
వై సిరీస్ 43 ఇంచుల టీవీ ధర – రూ . 22,999/-
యూ సిరీస్ 55 ఇంచుల టీవీ ధర – రూ. 49,999/-
గతంలో లాంచ్ అయిన వన్ ప్లస్ టీవీ క్యూ1 కూడా 55 అంగుళాల టీవీనే, కానీ దాని ధర మాత్రం రూ.69,999/-గా ఉంది.