డబ్బులు కట్టించుకుని చేతులెత్తేసి.. కరోనాతో ఏడాది చిన్నారి మృతి
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖలో దారుణం చోటుచేసుకుంది. కరోనా బారిన పడిన ఏడాది చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. విషయం తెలిసి బాధిత తల్లిదండ్రులు కేజీహెచ్ ఎదుట కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు. దీనంతటికీ ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు చిన్నారికి కరోనా లక్షణాలు ఉండటంతో తల్లిదండ్రులు వైజాగ్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ముందే డబ్బులు కట్టించుకున్న ఆస్పత్రి యాజమాన్యం చేతులెత్తేయడంతో చిన్నారిని వెంటనే అంబులెన్సులో కేజీహెచ్ ఆస్పత్రికి […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖలో దారుణం చోటుచేసుకుంది. కరోనా బారిన పడిన ఏడాది చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. విషయం తెలిసి బాధిత తల్లిదండ్రులు కేజీహెచ్ ఎదుట కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు. దీనంతటికీ ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు చిన్నారికి కరోనా లక్షణాలు ఉండటంతో తల్లిదండ్రులు వైజాగ్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
ముందే డబ్బులు కట్టించుకున్న ఆస్పత్రి యాజమాన్యం చేతులెత్తేయడంతో చిన్నారిని వెంటనే అంబులెన్సులో కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బెడ్లు సరిపడా లేకపోవడంతో అంబులెన్సులోనే చిన్నారికి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చిన్నారి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో బాధిత తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి.