తుక్కుగూడలో వారం పాటు లాక్‌డౌన్..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్న మహా నగరంలో ప్రజలు వరుసగా గాంధీ, ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత వలన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. అదే విధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తుక్కుగూడ మున్సిపాలిటీలో వారం పాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించనున్నట్లు పాలకమండలి నిర్ణయించింది. కరోనా కేసుల […]

Update: 2021-05-06 04:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్న మహా నగరంలో ప్రజలు వరుసగా గాంధీ, ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత వలన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. అదే విధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తుక్కుగూడ మున్సిపాలిటీలో వారం పాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించనున్నట్లు పాలకమండలి నిర్ణయించింది.

కరోనా కేసుల కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్భంధం కొనసాగుతున్న సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు షాపులకు అనుమతినిచ్చారు.ఆ తర్వాత అన్ని అన్ని దుకాణాలు మూతపడనున్నాయి. జనాలు కూడా అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News