చేగూరులో ఒకరికి కరోనా పాజిటివ్
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ డివిజన్ నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్దారించారు. ఇటీవల షాద్‌నగర్ డివిజన్‌కు చెందిన 56 మందిని వైద్యులు కరోనా వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అయితే అందరికీ నెగిటివ్ రాగా చేగూరుకు చెందిన వ్యక్తికి మాత్రం జ్వరం లక్షణాలు కనిపించడంతో ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించిన రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ […]
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ డివిజన్ నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్దారించారు. ఇటీవల షాద్‌నగర్ డివిజన్‌కు చెందిన 56 మందిని వైద్యులు కరోనా వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అయితే అందరికీ నెగిటివ్ రాగా చేగూరుకు చెందిన వ్యక్తికి మాత్రం జ్వరం లక్షణాలు కనిపించడంతో ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించిన రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ చందునాయక్ ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నందున అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు మీడియాకు తెలిపారు. ప్రజలు అప్రమత్తమై వైరస్ నివారణ చర్యలు తీసుకోవాలని సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు.
Tags : One man, Chegur, corona positive, rangareddy, ghandi hospital