అమెరికాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పులు జరిగాయి. టెక్సాస్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటంతో ఒకరు స్పాట్‌లోనే మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఇందులో తీవ్రంగా గాయపడ్డ నలుగురిని వెంటనే ఆస్పత్రికి చేర్చారు. ఇంకొకరు ఆస్తమాబారినపడ్డారు. దుండగుడిని అదుపులోకి తెచ్చే క్రమంలో ఓ పోలీసు అధికారీ కాల్పుల్లో గాయపడ్డారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. టెక్సాస్ రాష్ట్రంలోని బ్రియాన్ నగరంలో ఓ బిజినెస్ పార్క్‌లో కెంట్ మూర్ క్యాబినెట్ ఎదుట గురువారం మధ్యాహ్నం ఈ కాల్పులు […]

Update: 2021-04-08 21:23 GMT

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పులు జరిగాయి. టెక్సాస్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటంతో ఒకరు స్పాట్‌లోనే మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఇందులో తీవ్రంగా గాయపడ్డ నలుగురిని వెంటనే ఆస్పత్రికి చేర్చారు. ఇంకొకరు ఆస్తమాబారినపడ్డారు. దుండగుడిని అదుపులోకి తెచ్చే క్రమంలో ఓ పోలీసు అధికారీ కాల్పుల్లో గాయపడ్డారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. టెక్సాస్ రాష్ట్రంలోని బ్రియాన్ నగరంలో ఓ బిజినెస్ పార్క్‌లో కెంట్ మూర్ క్యాబినెట్ ఎదుట గురువారం మధ్యాహ్నం ఈ కాల్పులు జరిగాయి. దుండగుడు కెంట్ మూర్ క్యాబినెట్ కంపెనీలో ఉద్యోగిగా భావిస్తున్నారు. కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

అమెరికాలో తుపాకీ సంస్కృతి ఒక మహమ్మారిలా ప్రబలుతున్నదని, దీన్ని అరికట్టేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. తుపాకీ సంస్కృతిని అడ్డుకోవడానికి బైడెన్ ప్రభుత్వం యోచిస్తుండగా రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నిర్ణయం రాజ్యాంగ ఉల్లంఘనే అని విమర్శిస్తున్నారు. అమెరికాలో యేటా దాదాపు 40వేల మంది తుపాకీ కాల్పుల్లో మరణిస్తున్నారు. ఇందులో సగం మంది ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు వదులుతున్నారు. కొలరాడో, జార్జియా, కాలిఫోర్నియాలలో ఇటీవలే కాల్పుల మోత వినిపించగా, తాజాగా టెక్సాస్‌లో షూటింగ్ జరిగింది.

Tags:    

Similar News