చైనాలో వంద కోట్ల డోసుల పంపిణీ పూర్తి

బీజింగ్: చైనా వంద కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తి చేసింది. అయితే, ఎంతమందికి టీకా వేసిందన్న వివరాలను వెల్లడించలేదు. అన్ని దేశాల తీరునే చైనా కూడా రెండు డోసుల టీకాలను పంపిణీ చేస్తున్నది. పంపిణీ కార్యక్రమం లేటుగా స్టార్ట్ అయినా వేగంగా చేసుకుంటూ దూసుకెళ్తున్నది. వంద కోట్ల డోసుల్లో సగం డోసులు నెల వ్యవధికి లోపే పూర్తి చేయగలిగింది. చైనాలో అభివృద్ధి చేసిన ఏడు టీకాలను ఆ దేశ ప్రభుత్వం పంపిణీకి అనుమతించింది. ఇందులో రెండు […]

Update: 2021-06-20 08:17 GMT

బీజింగ్: చైనా వంద కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తి చేసింది. అయితే, ఎంతమందికి టీకా వేసిందన్న వివరాలను వెల్లడించలేదు. అన్ని దేశాల తీరునే చైనా కూడా రెండు డోసుల టీకాలను పంపిణీ చేస్తున్నది. పంపిణీ కార్యక్రమం లేటుగా స్టార్ట్ అయినా వేగంగా చేసుకుంటూ దూసుకెళ్తున్నది. వంద కోట్ల డోసుల్లో సగం డోసులు నెల వ్యవధికి లోపే పూర్తి చేయగలిగింది. చైనాలో అభివృద్ధి చేసిన ఏడు టీకాలను ఆ దేశ ప్రభుత్వం పంపిణీకి అనుమతించింది. ఇందులో రెండు టీకాలు మూడేళ్లకు పైబడిన పిల్లల కోసం అనుమతించడం గమనార్హం. ఇప్పటి వరకు చైనా విదేశీ టీకాలు అనుమతించలేదు. కానీ, త్వరలో ఫైజర్ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమున్నట్టు తెలిసింది.

Tags:    

Similar News