కాంట్రాక్ట్ లెక్చరర్ల ఒక్కరోజు వేతనం విరాళం
దిశ, మెదక్: కరోనా వైరస్ నేపథ్యంలో బాధితులకు సహాయార్థం కాంట్రాక్టు లెక్చరర్లు తమ ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేందుకు నిర్ణయించారు. సిద్ధిపేట కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో లేఖలు అందించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనక చంద్రం మాట్లాడుతూ.. ఉడతా భక్తి సహాయంగా తమ వంతుగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నా జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ తదితర కాంట్రాక్ట్ […]
దిశ, మెదక్: కరోనా వైరస్ నేపథ్యంలో బాధితులకు సహాయార్థం కాంట్రాక్టు లెక్చరర్లు తమ ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేందుకు నిర్ణయించారు. సిద్ధిపేట కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో లేఖలు అందించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనక చంద్రం మాట్లాడుతూ.. ఉడతా భక్తి సహాయంగా తమ వంతుగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నా జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ తదితర కాంట్రాక్ట్ లెక్చరర్ల ఒకరోజు వేతనాన్ని సీఎంఆర్ఎఫ్కు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరినట్లు చెప్పారు. దీంతో సుమారు 61 లక్షల పైచిలుకు డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్‌లో జమ అవుతాయని ఆయన వివరించారు.
tag: One-day wage donation, cm relief fund, contract lecturers