'స్త్రీనిధి' ఉద్యోగుల ఒక రోజు విరాళం

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రామీణాభివృద్ధి శాఖలోని పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘స్ర్తీనిధి’ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని కరోనా బాధితులకు ఉపయోగించడానికి వీలుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. ‘స్త్రీనిధి’లోని సుమారు 425మంది ఉద్యోగులు సమిష్టిగా తీసుకున్న నిర్ణయం మేరకు వారి ఒక రోజు వేతనంగా వచ్చే రూ. 4లక్షల చెక్కును రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం ప్రగతి భవన్‌లో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. స్ర్తీనిధి బ్యాంకు ఉద్యోగులను […]

Update: 2020-08-12 10:00 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రామీణాభివృద్ధి శాఖలోని పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘స్ర్తీనిధి’ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని కరోనా బాధితులకు ఉపయోగించడానికి వీలుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. ‘స్త్రీనిధి’లోని సుమారు 425మంది ఉద్యోగులు సమిష్టిగా తీసుకున్న నిర్ణయం మేరకు వారి ఒక రోజు వేతనంగా వచ్చే రూ. 4లక్షల చెక్కును రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం ప్రగతి భవన్‌లో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. స్ర్తీనిధి బ్యాంకు ఉద్యోగులను మంత్రి కేటీఆర్ అభినందించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, చిరుద్యోగులే అయినప్పటికీ ఒక రోజు వేతనాన్ని కరోనా అవసరాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారని ప్రశంసించారు.

Tags:    

Similar News