రామతీర్థంలో మరోసారి ఉద్రిక్తత

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. నెల్లిమర్ల జంక్షన్‌లో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, రామతీర్థం కొండపైకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. అయితే అందరినీ […]

Update: 2021-01-06 23:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. నెల్లిమర్ల జంక్షన్‌లో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, రామతీర్థం కొండపైకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. అయితే అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రామతీర్థం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Tags:    

Similar News