ట్యూషన్లకు పెరుగుతోంది క్రేజ్!

దిశ, వెబ్‌డెస్క్: పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు స్కూల్‌కు వెళ్లి వచ్చి, ఆ తర్వాత ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్యూషన్‌కు వెళ్లడం లేదా ట్యూటరే ఇంటికి రావడం గతంలో జరిగేది. ఇప్పుడు కరోనా వల్ల ఏకంగా పాఠశాలలే ఆన్‌లైన్‌కు వచ్చేశాయి. ఇక ట్యూషన్లు చెప్పుకునే వాళ్ల పరిస్థితి దారుణంగా మారిందని అనుకున్నారు. కానీ కాదు.. లాక్‌డౌన్ తర్వాత ట్యూషన్లకు క్రేజ్ పెరిగింది. సాధారణంగా ఏ విద్యార్థి అయినా […]

Update: 2020-10-31 03:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు స్కూల్‌కు వెళ్లి వచ్చి, ఆ తర్వాత ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్యూషన్‌కు వెళ్లడం లేదా ట్యూటరే ఇంటికి రావడం గతంలో జరిగేది. ఇప్పుడు కరోనా వల్ల ఏకంగా పాఠశాలలే ఆన్‌లైన్‌కు వచ్చేశాయి. ఇక ట్యూషన్లు చెప్పుకునే వాళ్ల పరిస్థితి దారుణంగా మారిందని అనుకున్నారు. కానీ కాదు.. లాక్‌డౌన్ తర్వాత ట్యూషన్లకు క్రేజ్ పెరిగింది. సాధారణంగా ఏ విద్యార్థి అయినా ట్యూషన్‌కు ఎందుకు వెళతాడు? క్లాసులో అందరితో పాటు విన్న పాఠాలు అర్థంకాకపోతే అవే పాఠాలను ట్యూషన్‌లో చెప్పించుకోవడానికి వెళతాడు. అంటే ఇక్కడ పాఠం ఒక్కటే కానీ, చెప్పేవారు వేరు. అందరూ అన్ని సబ్జెక్టులు అత్యద్భుతంగా చెప్పలేరు, అలాగే అందరు విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో నిష్ణాతులుగా ఉండలేరు. అందుకే వారిని ఇబ్బందిపెడుతున్న సబ్జెక్టును ఆ సబ్జెక్టుకు చెందిన నిపుణుడి వద్ద నేర్చుకోవడానికి ట్యూషన్‌ను వారధిగా వాడుకుంటారు.

అయితే కరోనా పాండమిక్ తర్వాత ఆన్‌లైన్‌లో క్లాసులు జరుగుతున్నప్పటికీ చాలా మంది పిల్లలకు కాన్సెప్ట్‌లు అర్థం కాట్లేదు. ఒకప్పుడంటే క్లాసులోనే కూర్చుని వినాలి కాబట్టి తప్పక వినాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు వినాలనుకుంటే వినొచ్చు లేదంటే లేదు. ఇంకా చెప్పాలంటే వింటున్నట్లు నటించవచ్చు. ఎలాగూ ట్యూషన్ కూడా ఆన్‌లైన్‌లో చెప్పుకోవచ్చు కాబట్టి గుంపులో గోవిందం లాగ కాకుండా వ్యక్తిగతంగా పాఠాలు చెప్పించుకోవడానికి పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ముఖ్యమైన సబ్జెక్టులకు ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పించుకుంటున్నారు. ఈ క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్ టీచర్లందరూ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్యూషన్లు లభిస్తుండటంతో ఎక్కువ మంది ట్యూషన్లకే మొగ్గుచూపుతున్నారు.

Tags:    

Similar News