ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా

– ప్రకటించిన జపాన్ ప్రధాని, ఐవోసీ అధ్యక్షుడు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది జులై 24 నుంచి టోక్యోలో నిర్వహించాల్సిన ఒలింపిక్స్-2020ని ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జపాన్ ప్రధాని షింజో అబే, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ మంగళవారం టోక్యోలో జరిగిన విలేకరుల సమావేశంలో సంయుక్తంగా ప్రకటించారు. ‘ఒలింపిక్స్ రద్దు చేయడమనే ప్రశ్నే మొదటి నుంచి మా ఆలోచనల్లో లేదు. అందుకే ఖర్చు పెరిగినా […]

Update: 2020-03-24 08:39 GMT

– ప్రకటించిన జపాన్ ప్రధాని, ఐవోసీ అధ్యక్షుడు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది జులై 24 నుంచి టోక్యోలో నిర్వహించాల్సిన ఒలింపిక్స్-2020ని ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జపాన్ ప్రధాని షింజో అబే, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ మంగళవారం టోక్యోలో జరిగిన విలేకరుల సమావేశంలో సంయుక్తంగా ప్రకటించారు. ‘ఒలింపిక్స్ రద్దు చేయడమనే ప్రశ్నే మొదటి నుంచి మా ఆలోచనల్లో లేదు. అందుకే ఖర్చు పెరిగినా సరే ఏడాది పాటు ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు’ ప్రధాని షింజో అబే తెలిపారు.

వచ్చే ఏడాది వేసవికి ‘ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం వల్ల అథ్లెట్లు, నిర్వాహకులు, ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది, భయాలు లేకుండా పాల్గొనే అవకాశం ఉంటుంది. కరోనా ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఒలంపిక్స్ జరపడం కూడా అంత మంచి నిర్ణయం కాదనే వాయిదా వేశామని’ ఆయన చెప్పారు. 2021 వేసవి కంటే ముందే ఒలింపిక్స్ ముగించడానికి ప్రయత్నిస్తామని ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశారు. అథ్లెట్లు, సహాయక సిబ్బంది ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాచ్ చెప్పారు.

ఒలింపిక్స్‌తో పాటు పారా ఒలింపిక్స్ గేమ్స్ కూడా వాయిదా పడ్డాయని తెలిపారు. కాగా, 2021లో జరిపినా ‘ఒలింపిక్స్ టోక్యో 2020’ గానే గుర్తిస్తామని థామస్ బాచ్ స్పష్టం చేశారు.

Tags: Olympics, Corona effect, Tokyo, IOC President, Japan PM

Tags:    

Similar News