క్రీడా గ్రామంలోకి వెళ్లిన చెక్ రిపబ్లిక్ టీమ్
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడిన ఒలింపిక్స్ నిర్వహణపై వస్తోన్న అనుమానాల మధ్య టోక్యోలో ఒలింపిక్ విలేజ్‌ను నిర్వాహక కమిటీ మంగళవారం ప్రారంభించింది. సాధారణంగా ఒలింపిక్ గ్రామం ఓపెనింగ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తారు. కానీ కరోనా నేపథ్యంలో సాదాసీదాగానే గ్రామాన్ని తెరిచారు. మొదటిగా చెక్ రిపబ్లిక్ అథ్లెట్ల బృందం గ్రామంలోకి అడుగు పెట్టింది. క్రీడా గ్రామంలో ఉండే ప్రతీ అథ్లెట్ నిర్వాహక కమిటీ విధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అంతే కాకుండా ప్రతీ […]
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడిన ఒలింపిక్స్ నిర్వహణపై వస్తోన్న అనుమానాల మధ్య టోక్యోలో ఒలింపిక్ విలేజ్‌ను నిర్వాహక కమిటీ మంగళవారం ప్రారంభించింది. సాధారణంగా ఒలింపిక్ గ్రామం ఓపెనింగ్ వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తారు. కానీ కరోనా నేపథ్యంలో సాదాసీదాగానే గ్రామాన్ని తెరిచారు. మొదటిగా చెక్ రిపబ్లిక్ అథ్లెట్ల బృందం గ్రామంలోకి అడుగు పెట్టింది. క్రీడా గ్రామంలో ఉండే ప్రతీ అథ్లెట్ నిర్వాహక కమిటీ విధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అంతే కాకుండా ప్రతీ రోజు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.
ఒలింపిక్ గ్రామాన్ని వదిలి స్టేడియంలకు వెళ్లే ముందు ఒకసారి.. తిరిగి గ్రామంలోకి ప్రవేశించే ముందు మరోసారి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రామంలో ప్రవేశించిన ప్రతీ అథ్లెట్ మాస్కులు తప్పకుండా ధరించాలి. భౌతిక దూరం పాటించడంతో పాటు చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు ఉపయోగించడం తప్పనిసరి. వారికి కేటాయించిన గదుల కిటికీలను నిర్ణీత సమయానికి ఒకసారి తప్పనిసరిగా తెరవాల్సి ఉంటుంది. ఈ క్రీడా గ్రామంలో 11 వేల మంది అథ్లెట్లు బస చేయనున్నారు. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత జరిగే పారాలింపిక్స్‌కు సంబంధించిన 4400 అథ్లెట్లు కూడా ఇక్కడే బస చేయనున్నారు.