ఇంగ్లాండ్ జట్టులోకి తిరిగి రానున్న ఓలీ రాబిన్‌సన్
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పేస్ బౌలర్ ఓలీ రాబిన్‌సన్ తిరిగి జాతీయ జట్టులోకి రావడానికి మార్గం సుగమమైంది. న్యూజీలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఓలీ రాబిన్‌సన్.. గతంలో చేసిన జాతి వివక్ష ట్వీట్ల కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఎనిమిదేళ్ల క్రితం కౌంటీ క్రికెట్ ఆడే సమయంలో ఆసియా మహిళలు, ఇతరుల పట్ల అభ్యంతర వ్యాఖ్యలను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. న్యూజీలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన సమయంలోనే అతడి పాత ట్వీట్లు బయటపడ్డాయి. […]
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ పేస్ బౌలర్ ఓలీ రాబిన్‌సన్ తిరిగి జాతీయ జట్టులోకి రావడానికి మార్గం సుగమమైంది. న్యూజీలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఓలీ రాబిన్‌సన్.. గతంలో చేసిన జాతి వివక్ష ట్వీట్ల కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఎనిమిదేళ్ల క్రితం కౌంటీ క్రికెట్ ఆడే సమయంలో ఆసియా మహిళలు, ఇతరుల పట్ల అభ్యంతర వ్యాఖ్యలను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. న్యూజీలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన సమయంలోనే అతడి పాత ట్వీట్లు బయటపడ్డాయి. దీంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) జాతీయ జట్టు నుంచి సస్పెండ్ చేసి తిరిగి తన కౌంటీ జట్టు ససెక్స్‌కు పంపించేసింది. కాగా, అతడిపై వచ్చిన ఆరోపణలపై జూన్ 30న క్రికెట్ క్రమశిక్షణా కమిషన్ విచారణ చేపట్టింది. తాను చిన్నతనంలో తెలియక చేసిన తప్పు అని రాబిన్‌సన్ ఒప్పుకోవడంతో అతడికి 3200 పౌండ్లు (రూ. 3.3 లక్షలు) జరిమానాగా విధించి వదిలేసింది. కాగా, రాబిన్‌సన్‌కు లైన్ క్లియర్ కావడంతో రాబోయే ఇండియా సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. న్యూజీలాండ్‌తో ఏడిన ఏకైక టెస్టులో అతడు చక్కగా రాణించడంతో ఇండియాతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.