జర కొత్త పాసుబుక్ ఇప్పించండి సారు
దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామానికి చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలు రైతు బంధు, కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు రాక ఇబ్బందులు పడుతోంది. గ్రామానికి చెందిన తోట మణెమ్మ భర్త పెరు గుండెయ్యకు గత ఆరేండ్లుగా రైతుబంధు డబ్బులు రావడం లేదు. ఆమె వద్ద పాత పాస్‌బుక్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త పాస్‌బుక్ ఇంకా రాలేదు. కొత్త పాస్‌బుక్ కోసం ఏప్రిల్ నెలలో కేవైసీ చేయించగా లాక్‌డౌన్ వల్ల అన్ని […]
దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామానికి చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలు రైతు బంధు, కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు రాక ఇబ్బందులు పడుతోంది. గ్రామానికి చెందిన తోట మణెమ్మ భర్త పెరు గుండెయ్యకు గత ఆరేండ్లుగా రైతుబంధు డబ్బులు రావడం లేదు. ఆమె వద్ద పాత పాస్‌బుక్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త పాస్‌బుక్ ఇంకా రాలేదు. కొత్త పాస్‌బుక్ కోసం ఏప్రిల్ నెలలో కేవైసీ చేయించగా లాక్‌డౌన్ వల్ల అన్ని పనులు ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ధరఖాస్తును జూన్ 16 చివరి తేదీగా ప్రకటించింది. దీంతో ఎన్నిమార్లు స్థానిక తహశీల్దారు, ఆర్డీవో కార్యాలయాల చుట్టు తిరిగినా కొత్త పాసుబుక్ రాలేదు.ఈ వయసులో తాను రైతుబంధు కోసం ఆఫీసులు చుట్టు తిరుగుతుంటే అధికారులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయింది.ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి కొత్త పాసుబుక్కు ఇప్పించాలని ఆమె కోరుతోంది.