ద్రోహం.. మిత్రుడి భార్యను హైదరాబాద్‌కు తీసుకొచ్చి!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రోజుల్లో ద్రోహం అనేది కామన్ అయిపోయింది. ఎక్కడోచోట.. ఎవరో ఒకరు ఇతరుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. కొందరు దానిని లైట్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. మోసం చేసిన వాడిని చంపడమో లేదా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు డబ్బుల మ్యాటర్, లేడిస్ విషయంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఇన్ని రోజులు నమ్మిన స్నేహితుడు, […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రోజుల్లో ద్రోహం అనేది కామన్ అయిపోయింది. ఎక్కడోచోట.. ఎవరో ఒకరు ఇతరుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. కొందరు దానిని లైట్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. మోసం చేసిన వాడిని చంపడమో లేదా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే వెలుగుచూస్తున్నాయి.
ముఖ్యంగా ఇలాంటి ఘటనలు డబ్బుల మ్యాటర్, లేడిస్ విషయంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఇన్ని రోజులు నమ్మిన స్నేహితుడు, మహిళ మనల్ని మోసం చేశారని తెలిసిన వారు చివరకు ఆ అవమానం భరించలేక.. బయట తెలిస్తే పరువు పోతుందని భావించి బలవణ్మరనానికి పాల్పడుతున్నారు. మరికొందరైతే వారిపై పగ తీర్చకునేందుకు సిద్ధపడుతున్నారు. క్షణికావేశంలో చేసే తప్పుల వలన అటు మోసం చేసినవారు, మోసపోయిన వారి జీవితాలు ఎటూ కాకుండా పోతున్నాయి.
సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కానీ, రెగ్యూలర్‌కు భిన్నంగా ఈసారి మోసం చేసిన వాడు, పోయినవాడు కాకుండా వేరే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అదేలా అంటే.. నగరానికి చెందిన యోగేశ్ అట్లా, మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ శుక్లా స్నేహితులు. యోగేశ్ బేగంబజార్‌లో వ్యాపారం నిర్వహిస్తుండేవాడు. నెలరోజుల కిందట ఇండోర్‌కు వెళ్లిన అతను స్నేహితుడి భార్యకు మాయమాటలు చెప్పి మూడో కంటికి తెలియకుండా హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. ఆమెను కుందన్ బాగ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంచాడు. దీంతో కనిపించకుండా పోయిన తన భార్య కోసం అంకిత్ శుక్లా స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన వారు మిస్సింగ్ వివాహిత హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు.
దీంతో బాధితుని మామ విశ్వసుందర్ శుక్లా(65) జనవరి 29న నగరానికి వచ్చి అంకిత్ మిత్రుడు యోగేశ్ అట్లాను తన కూతురి ఆచూకీ కోసం నిలదీశాడు. తనకు తెలియదని వాదించడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వృద్ధుడు అని కూడా చూడకుండా యోగేశ్ నెట్టివేయడంతో విశ్వసుందర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఉస్మానియాకు తరలించి వైద్యం అందించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి శుక్లా మృతిచెందడంతో బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్టు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.