POLICE: ఇచ్చిన అవకాశాన్ని ఆర్జీవీ యూజ్ చేసుకోలేదు.. ఇక అరెస్ట్ ఒక్కటే మార్గం
‘డిజిటల్ విధానంలో విచారణకు హాజరు అవుతానని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కోరారు.
దిశ, వెబ్‌డెస్క్: ‘డిజిటల్ విధానంలో విచారణకు హాజరు అవుతానని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కోరారు. విచారణాధికారిగా నాకున్న ఐవో(Inquiry Officer) పవర్స్ ప్రకారం.. డిజిటల్ విచారణకు తాము అంగీకరించే ప్రసక్తే లేదు. ఆర్జీవీ కోరిన విధంగా ఇప్పటికే విచారణకు హాజరయ్యేందుకు రెండుసార్లు అవకాశం ఇచ్చాం. ఆ అవకాశాలను ఆయన సద్వినియోగం చేసుకోలేదు. పోలీసు అధికారులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించారు. కాబట్టి చట్టప్రకారం ఆయన్ను అరెస్ట్ చేసి తీరుతాం’ అని సీఐ శ్రీకాంత్(CI Srikanth) స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.
ఆయన ఇంట్లో లేరని సిబ్బంది చెప్పినా.. వచ్చే వరకు వేచి చూస్తామని పడిగాపులు కాస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వ్యూహం అనే సినిమాను రూపొందించి వైసీపీకి ఆర్జీవీ బహిరంగంగా మద్దతు పలికారు. ప్రమోషన్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలను షేర్ చేశారు. ఈ విషయంపై ఒంగోలులో కేసు నమోదు అయింది. కేసు బుక్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Read More : మరికొద్దిసేపట్లో ఆర్జీవీ అరెస్ట్ ?
RGV Missing: అరెస్ట్ భయంతో ఆర్జీవీ అదృశ్యం?
RGV Advocate: సమాధానం చెప్పినా పోలీసులు ఇంటికి రావడమేంటి?