కామారెడ్డిలో వృద్ధుడికి కరోనా పాజిటివ్

దిశ, నిజామాబాద్: ఇన్నిరోజులు గ్రీన్‌జోన్‌‌గా ఉన్న కామారెడ్డి పట్టణంలో మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. లాక్‌డౌన్ 3 తర్వాత జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో 60 ఏళ్ల వృద్ధునికి పాజిటివ్ వచ్చినట్లు గాంధీ వైద్యులు నిర్దారించారు. గత నెల 30వ తేదీనాడు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడికి దగ్గు, దమ్ము, ఆస్తమా ఉన్నట్టు గుర్తించిన అక్కడి వైద్యులు గాంధీకి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షలు జరపగా పాజిటివ్ తేలిందని వైద్యాధికారులు తెలిపారు.అతని కుటుంబ సభ్యుల […]

Update: 2020-06-04 06:49 GMT

దిశ, నిజామాబాద్: ఇన్నిరోజులు గ్రీన్‌జోన్‌‌గా ఉన్న కామారెడ్డి పట్టణంలో మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. లాక్‌డౌన్ 3 తర్వాత జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో 60 ఏళ్ల వృద్ధునికి పాజిటివ్ వచ్చినట్లు గాంధీ వైద్యులు నిర్దారించారు. గత నెల 30వ తేదీనాడు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడికి దగ్గు, దమ్ము, ఆస్తమా ఉన్నట్టు గుర్తించిన అక్కడి వైద్యులు గాంధీకి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షలు జరపగా పాజిటివ్ తేలిందని వైద్యాధికారులు తెలిపారు.అతని కుటుంబ సభ్యుల 13మందిని హోమ్ క్వారంటైన్‌కు వెంటనే తరలించారు.అయితే జిల్లాలో లాక్‌డౌన్ 3 సమయంలో 12 మందికి పాజిటివ్ రాగా, వారంతా చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే వృద్ధునికి ఎలా వైరస్ సోకిందనే అంశంపై వైద్య వర్గాలు ఆరా తీస్తున్నాయి.

Tags:    

Similar News