ముగిసిన పాతబస్తీ బోనాలు
దిశ, చాంద్రాయణగుట్ట: పాతబస్తీ బోనాల ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన రంగం కార్యక్రమం స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. కరోనా మహమ్మారి ప్రజలను కాపాడాలని భక్తులు ఈ సందర్భంగా కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చూసుకుంటానని ఆమె అన్నారు. త్వరలో చండీయాగం నిర్వహించాలని అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించాలని కోరింది. రంగంతో అమ్మవారి జాతర నిరాడంబరంగా తెలంగాణ […]
దిశ, చాంద్రాయణగుట్ట: పాతబస్తీ బోనాల ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన రంగం కార్యక్రమం స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. కరోనా మహమ్మారి ప్రజలను కాపాడాలని భక్తులు ఈ సందర్భంగా కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చూసుకుంటానని ఆమె అన్నారు. త్వరలో చండీయాగం నిర్వహించాలని అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించాలని కోరింది.
రంగంతో అమ్మవారి జాతర నిరాడంబరంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో భక్తులు లేకుండా నిర్వహించారు. ఘటాల ఊరేగింపు నడుమ స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. లాల్ దర్వాజా మహంకాళి ఆలయాన్ని సంబంధిత పోతురాజు దేవాలయం చుట్టూ డప్పు మేళాల మధ్య విన్యాసాలు నిర్వహించారు.