నిధుల సేకరణ కొనసాగిస్తున్న ఓలా ఎలక్ట్రిక్

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో వేగవంతంగా దూసుకెళ్తున్న ఓలా సంస్థ అదే స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించే చర్యలు తీసుకుంటుంది. దీనికోసం దక్షిణాసియా మార్కెట్లో ఎదిగేందుకు ఓలా సంస్థ తాజాగా 200 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 1,500 కోట్లు)ను సేకరించింది. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2, ఫాల్కన్ ఎడ్జ్ కేపిటల్ ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను సేక‌రించినట్టు ఓలా పేర్కొంది. ఈ నిధుల సేకరణ ద్వారా ఓలా సంస్థ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్ల(రూ. […]

Update: 2021-09-30 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో వేగవంతంగా దూసుకెళ్తున్న ఓలా సంస్థ అదే స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించే చర్యలు తీసుకుంటుంది. దీనికోసం దక్షిణాసియా మార్కెట్లో ఎదిగేందుకు ఓలా సంస్థ తాజాగా 200 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 1,500 కోట్లు)ను సేకరించింది. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2, ఫాల్కన్ ఎడ్జ్ కేపిటల్ ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను సేక‌రించినట్టు ఓలా పేర్కొంది. ఈ నిధుల సేకరణ ద్వారా ఓలా సంస్థ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్ల(రూ. 23 వేల కోట్ల)కు చేరుకుంది. భారత్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయాలను పెంచే లక్ష్యంతో మిషన్ ఎలక్ట్రిక్ అనే కార్యక్రమాన్ని పటిష్టం చేయడానికి ఈ నిధులను సమకూర్చుతున్నట్టు కంపెనీ తెలిపింది.

అలాగే, ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించనున్నామని, 2025 తర్వాత ఇతర వాహనాల విభాగాన్ని అభివృద్ధి చేసే అంశంపై ప్రణాళిక రూపొందించనున్నట్టు కంపెనీ వివరించింది. ఇకపై దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కంపెనీ భారీ పెట్టుబడులను కొనసాగిస్తుందని వెల్లడించింది.

Tags:    

Similar News