చంద్రబాబు నివాసానికి నోటీసులు

దిశవెబ్ డెస్క్: ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులను జారీ చేశారు. కృష్ణా నదిలో భారీగా వరద నీరు పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. వరదల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి పోవాలని వారికి అధికారులు సూచించారు. కాగా గతంలోనూ చంద్రబాబు నివాసానికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నియమ నిబంధనలను అతి క్రమించి ఆ భవనాన్ని నిర్మించారనీ […]

Update: 2020-09-27 09:02 GMT
చంద్రబాబు నివాసానికి నోటీసులు
  • whatsapp icon

దిశవెబ్ డెస్క్: ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులను జారీ చేశారు. కృష్ణా నదిలో భారీగా వరద నీరు పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. వరదల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి పోవాలని వారికి అధికారులు సూచించారు.

కాగా గతంలోనూ చంద్రబాబు నివాసానికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నియమ నిబంధనలను అతి క్రమించి ఆ భవనాన్ని నిర్మించారనీ నోటీసుల్లో అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News