రైతుల ధర్నాలతో అలర్ట్ అయిన అధికారులు.. కరం ఇండస్ట్రీలో ఏం జరిగుతోంది ?
దిశ కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామ సొసైటీ పరిధిలో గత నెల రోజుల క్రితం కరం ఇండస్ట్రీలో తూకం విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ విషయంపై రైతులు ధర్నా చేయడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తొమ్మిది రైస్ మిల్లర్లు,కరం ఇండస్ట్రీతో చేతులు కలిపి తూకం విషయంలో అవకతవకలు జరిగి భారీ మొత్తంలో రైతులను మోసం చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ అలర్ట్ అయ్యి వచ్చిన ఆరోపణలో వాస్తవాలను […]
దిశ కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామ సొసైటీ పరిధిలో గత నెల రోజుల క్రితం కరం ఇండస్ట్రీలో తూకం విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ విషయంపై రైతులు ధర్నా చేయడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తొమ్మిది రైస్ మిల్లర్లు,కరం ఇండస్ట్రీతో చేతులు కలిపి తూకం విషయంలో అవకతవకలు జరిగి భారీ మొత్తంలో రైతులను మోసం చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ అలర్ట్ అయ్యి వచ్చిన ఆరోపణలో వాస్తవాలను తెలుసుకోవడం కోసం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. దీంతో జిల్లా యంత్రాంగం మండల కేంద్రంలో రెండు రోజులు హల్ చల్ చేసి కరం ఇండస్ట్రీలో తూకం జరిగిన విషయం వాస్తవమేనని తేల్చి చెప్పిన ట్రాక్ షీట్ ప్రకారం 330 లారీలు తూకం చేయగా సుమారు 814 క్వింటాళ్ల ధాన్యం వ్యత్యాసం వచ్చిందని అన్నారు. తూ తూ..మంత్రంగా కరం ఇండస్ట్రీని సీజ్ చేసి వెళ్లిపోయారు. కానీ అందులో కుమ్మక్కైన తొమ్మిది రైస్ మిల్లర్ల పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
రైతులకు,రైస్ మిల్లర్లకు సంధి కుదిర్చిన.. పాలకవర్గం
ధాన్యం తూకం విషయంలో జరిగిన అవకతవకలు సొసైటీ పాలకవర్గ హస్తం ఉందని ప్రతిపక్ష పార్టీలు బిజెపి,కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేస్తున్న దృశ్యం పాలక వర్గం తొమ్మిది రైస్ మిల్లర్లు యజమానులతో కలిసి తూకంలో నష్టపోయిన రైతులతో సంధి కుదిర్చి ధాన్యం రికవరీ చేసి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి 330 లారీలు కరం ఇండస్ట్రీలో తూకం చేయగా అందులో సుమారు 812 క్వింటాళ్ల వ్యత్యాసం లో 475 క్వింటాళ్ల వరకు సహకార సంఘం రికవరీ చేసింది,మిగిలిన 337 క్వింటాలు రికవరీ చేసిన తర్వాత రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని పాలకవర్గం మీడియా ముఖంగా తెలిపారు.
నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న అధికారులు
రైతులు ధాన్యం తూకం విషయంలో అవకతవకలు జరిగిన విషయం వాస్తవమేనని తేల్చిన అధికారులు రెండు రోజులు హడావిడి చేసి కరం ఇండస్ట్రీతో చేతులు కలిపి, రైతులను దోపిడీ చేసిన తొమ్మిది రైస్ మిల్లర్లు పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, నిర్మాణ దశలో ఉన్న రైస్ మిల్లర్లకు,శిథిలావస్థకు చేరిన రైస్ మిల్లుకు ధాన్యం అలాట్ మెంట్ ఎలా చేస్తారని, ప్రతిపక్ష నాయకులు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లి ఫిర్యాదు అందించి,ధర్నాలు రాస్తారోకోలు,రిలే నిరాహార దీక్ష చేసిన అధికారులతో ఎలాంటి స్పందన రాకపోవడం సమస్యను నీరుగార్చే ప్రయత్నం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.