టార్గెట్ కరోనా జాడ…!

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ విస్తరించకుండా అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైరస్‌ కట్టడి టార్గెట్‌గా ప్రణాళికలు రూపొందించి పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ర్యాండమ్‌ సర్వేతో పాటు శాంపిళ్ల సేకరణ జరుపుతున్నారు. శాఖల సమన్వయంతో కేసులను గుర్తించడం, వారి కుటుంబ సభ్యులను, సన్నిహితంగా తిరిగిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. విదేశాలకు వెళ్లొచ్చిన వారు, మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి ద్వారా వైరస్ సోకిన వారిని గుర్తించగా, ఇప్పుడు దేవబంద్, అజ్మేర్ […]

Update: 2020-04-19 04:02 GMT

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ విస్తరించకుండా అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైరస్‌ కట్టడి టార్గెట్‌గా ప్రణాళికలు రూపొందించి పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ర్యాండమ్‌ సర్వేతో పాటు శాంపిళ్ల సేకరణ జరుపుతున్నారు. శాఖల సమన్వయంతో కేసులను గుర్తించడం, వారి కుటుంబ సభ్యులను, సన్నిహితంగా తిరిగిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. విదేశాలకు వెళ్లొచ్చిన వారు, మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి ద్వారా వైరస్ సోకిన వారిని గుర్తించగా, ఇప్పుడు దేవబంద్, అజ్మేర్ ప్రాంతాలను సందర్శించిన వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నాయి నిఘా వర్గాలు.

మొదట్లో ఆర్థిక, సామాజిక కారణాలతో కొందరు కరోనా పరీక్షలకు ముందుకు రాలేదు. అయితే లక్షణాలు ముదిరాకనే అంతా బయట పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కరోనా వైరస్ అనుమానితులకు వైద్యంపై గ్రామీణ వైద్యులపై ఆంక్షలు విధించింది. ఎవరికైన వైద్యం చేస్తే వివరాలు ఇవ్వాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ప్రైవేట్ వైద్యులకు సైతం వార్నింగ్ వచ్చింది. అటు మెడికల్ షాపులకు సైతం ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మకాలు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం కరోనా వైరస్ ఏ రూపంలో ఉన్న ఎక్కడ ఉన్న దానిని గుర్తించడమే టార్గెట్‌గా పని చేస్తుంది అధికార యంత్రాంగం. కరోనా లక్షణాలను ప్రాథమికంగా ఉన్నప్పుడే గుర్తిస్తే విస్తరణను అడ్డుకోవడంతో పాటు మూడో దశకు చేరకుండా, పాజిటివ్ కేసులు తగ్గించడం హట్‌స్పాట్ జోన్‌ల నుంచి ఆరెంజ్‌ జోన్‌కు తగ్గించడం లక్ష్యంగా పనిచేస్తున్నారు అధికారులు.

tags: Coronavirus, Lockdown, Quarantine, Markaz, Deoband, Ajmer, Medical Shops, Private Doctors, Nizamabad

Tags:    

Similar News