కడుపు మండి.. ధాన్యానికి నిప్పు
దిశ, ఆదిలాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్న రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నా అధికారులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యానికి నిప్పు పెట్టారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వి గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. రైతులు పండించిన మొక్కజొన్న, వరి ధాన్యం కళ్లంలో ఎండబెట్టి నెల గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు […]
దిశ, ఆదిలాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్న రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నా అధికారులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యానికి నిప్పు పెట్టారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వి గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. రైతులు పండించిన మొక్కజొన్న, వరి ధాన్యం కళ్లంలో ఎండబెట్టి నెల గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. కాగా, రైతుల ఆందోళనల్లో ఉస్మానియా విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు సర్దార్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
Tags: Officers, not start, buying grain, agitated farmers, adilabad, nirmal