దిశ ఎఫెక్ట్ : కదిలిన నాంపల్లి అధికారులు

దిశ, చండూరు : దిశ కథనానికి నాంపల్లి తహసీల్దార్ కార్యాలయ యంత్రాంగం కదిలింది. గురువారం ‘దిశ’ లో ప్రభుత్వ భూములు ధారాదత్తం, అధికార పార్టీ నాయకులకు అధికారులు దాసోహం, ఆన్‌లైన్‌లో అక్రమంగా ప్రభుత్వ భూములు నమోదు, రైతుబంధు పొందుతున్న వైనం, వెలుగులోకి వచ్చిన నాంపల్లి రెవెన్యూ యంత్రాంగం లీలలు అనే శీర్షికన వచ్చిన కథనానికి తహసీల్దార్ కార్యాలయం కదిలింది. 2014 నుండి కార్యాలయంలో పనిచేసిన వీఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్ ల జాబితా తయారు చేశారు. వీరి కాలంలో […]

Update: 2021-07-22 06:57 GMT

దిశ, చండూరు : దిశ కథనానికి నాంపల్లి తహసీల్దార్ కార్యాలయ యంత్రాంగం కదిలింది. గురువారం ‘దిశ’ లో ప్రభుత్వ భూములు ధారాదత్తం, అధికార పార్టీ నాయకులకు అధికారులు దాసోహం, ఆన్‌లైన్‌లో అక్రమంగా ప్రభుత్వ భూములు నమోదు, రైతుబంధు పొందుతున్న వైనం, వెలుగులోకి వచ్చిన నాంపల్లి రెవెన్యూ యంత్రాంగం లీలలు అనే శీర్షికన వచ్చిన కథనానికి తహసీల్దార్ కార్యాలయం కదిలింది. 2014 నుండి కార్యాలయంలో పనిచేసిన వీఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్ ల జాబితా తయారు చేశారు.

వీరి కాలంలో ఆన్ లైన్ లో నమోదైన భూముల వివరాలను సేకరించే పనిలో ప్రస్తుత యంత్రాంగం నిమగ్నమైంది. గత ఏడు సంవత్సరాల కాలంలో ఆన్‌లైన్లలో అక్రమంగా నమోదైన ప్రభుత్వ భూమి వివరాలు నమోదు, చేసిన అధికారుల జాబితాను వెంటనే తయారు చేయాలని తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు యంత్రాంగం ఉరుకులు పరుగుల మీద ఉదయాన్నే కార్యాలయానికి చేరుకొని వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో మండల ప్రజలు దిశ కథనానికి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.

Tags:    

Similar News