నయా హరితహారం… మొక్కలు ఎంత విడ్డూరంగా నాటుతారంటే?

దిశ,మహేశ్వరం: తెలంగాణ‌ను ఆకుపచ్చ తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటికీ ఏడో విడత హరితహరం కార్యక్రమం కొనసాగుతుంది. రహదారులకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇవేమి మాకు పట్టింపులేనట్లు పెద్ద పెద్ద చెట్ల కిందనే చెట్లను (మొక్కలు) నాటడం జరుగుతున్న ఘటన మహేశ్వరం మండలంలోని మహేశ్వరం గేట్ నుంచి కొత్తూరు గేట్ వరకు శ్రీశైలం జాతీయ రహదారి కి ఇరువైపులా హరితహరం కార్యక్రమంలో మొక్కలు నాటారు. […]

Update: 2021-07-17 03:39 GMT

దిశ,మహేశ్వరం: తెలంగాణ‌ను ఆకుపచ్చ తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటికీ ఏడో విడత హరితహరం కార్యక్రమం కొనసాగుతుంది. రహదారులకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇవేమి మాకు పట్టింపులేనట్లు పెద్ద పెద్ద చెట్ల కిందనే చెట్లను (మొక్కలు) నాటడం జరుగుతున్న ఘటన మహేశ్వరం మండలంలోని మహేశ్వరం గేట్ నుంచి కొత్తూరు గేట్ వరకు శ్రీశైలం జాతీయ రహదారి కి ఇరువైపులా హరితహరం కార్యక్రమంలో మొక్కలు నాటారు.

రహదారికి ఇరవైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్ల కిందనే 7వ విడత హరితహరం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. పెద్ద పెద్ద చెట్ల కింద మళ్ళీ మొక్కలు నాటితే, మొక్కలు ఎలా పెరుగుతాయని రహదారి పై ప్రయాణం చేసే పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారుల తీరుచూస్తుంటే మొక్కలు నాటమంటే నాటాము అనే విధంగా ఉందంటున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెట్ల కింద చెట్లను నాటితే ఏ విధంగా పెరుగుతాయో అనే అవగాహన లేకపోవడం దురదృష్టకరమంటున్నారు.

Tags:    

Similar News