కామారెడ్డిలో దాడులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాకు సరిఫడా ఎరువులు సరఫరా జరిగిన ఇంకా కోరత ఉండటంపై జిల్లా అధికారయంత్రాంగం ఓ కన్నేసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలపై రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అదేశాల మేరకు ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు. ప్రతి ఎరువుల షాపుకు వచ్చి ఎరువులు, రైతులకు పంపిణీ, మిగులు వివరాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్ర్టార్ కు, ఫిజికల్ తేడా […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాకు సరిఫడా ఎరువులు సరఫరా జరిగిన ఇంకా కోరత ఉండటంపై జిల్లా అధికారయంత్రాంగం ఓ కన్నేసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలపై రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అదేశాల మేరకు ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు. ప్రతి ఎరువుల షాపుకు వచ్చి ఎరువులు, రైతులకు పంపిణీ, మిగులు వివరాలను తనిఖీ చేశారు.
స్టాక్ రిజిస్ర్టార్ కు, ఫిజికల్ తేడా ఉంటే సీజ్ చేయాలని, లైసెన్స్ రద్దు చేయాలన్న అదేశాల మేరకు బాన్సువాడలో మండల వ్యవసాయ అధికారి, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు శ్రీలక్ష్మి ట్రేడర్స్ ను, ఎల్లారెడ్డి మండలం అజమాబాద్ పీఎసీఎస్ ను, పిట్లం మండల కేంద్రంలో కేతకీ సంఘమేశ్వర ట్రేడర్స్, మాచారెడ్డి మండలం పాల్వంచలో ఆర్ డీవో అధ్వర్యంలో మెహర్ సాయి రైతు కేంద్రంలో, గాంధారీ మండల కేంద్రంలో, బిబీ పేట్ మండల కేంద్రంలో లక్ష్మి ఫర్టిలైజర్ షాపులో, మద్నూర్ మండల కేంద్రంలో, నాగిరెడ్డి పేట్ మండలంలో గోపాల్ పేట్ లో, నసూరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో సాయీ ఫర్టిలైజర్స్, లింగంపేట్ మండల కేంద్రంలో రైతు డిపో పెస్టిసైడ్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందచేస్తామని అదికారులు తెలిపారు.