నర్సులకు కొత్త రూల్.. ‘గూగుల్ పే’‌లో లంచం ఇవ్వాల్సిందే అంటున్న అధికారులు

దిశ, తెలంగాణ బ్యూరో : నాలుగేళ్ళ తర్వాత ఉద్యోగం వచ్చిందని సంతోషించాలో లేక ఆఫీసు సిబ్బందికి కూడా లంచాలు ఇవ్వాల్సి వస్తుందని బాధపడాలో.. అర్థంకాని అయోమయానికి గురవుతున్నారు కొత్తగా రిక్రూట్ అయిన నర్సులు. కొత్తగా రిక్రూట్ అయిన నర్సులకు సర్వీసు బుక్‌(రిజిస్టర్)లను రూపొందించడానికి క్లర్కులు లంచం డిమాండ్ చేస్తున్నారు. రెండు వేల రూపాయలు ఇవ్వకపోతే కుదరదంటూ ముఖం మీదనే చెప్పేస్తున్నారు. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ’గూగుల్ పే’ ద్వారా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. విధుల్లో చేరిన […]

Update: 2021-07-25 07:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నాలుగేళ్ళ తర్వాత ఉద్యోగం వచ్చిందని సంతోషించాలో లేక ఆఫీసు సిబ్బందికి కూడా లంచాలు ఇవ్వాల్సి వస్తుందని బాధపడాలో.. అర్థంకాని అయోమయానికి గురవుతున్నారు కొత్తగా రిక్రూట్ అయిన నర్సులు. కొత్తగా రిక్రూట్ అయిన నర్సులకు సర్వీసు బుక్‌(రిజిస్టర్)లను రూపొందించడానికి క్లర్కులు లంచం డిమాండ్ చేస్తున్నారు. రెండు వేల రూపాయలు ఇవ్వకపోతే కుదరదంటూ ముఖం మీదనే చెప్పేస్తున్నారు. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ’గూగుల్ పే’ ద్వారా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. విధుల్లో చేరిన మొదటి రోజు నుంచే లంచాలు ఇవ్వక తప్పలేదు. లంచాలు తీసుకునే సంస్కృతి రిక్రూట్‌మెంట్ రోజు నుంచే నర్సులకు కూడా అలవాటు చేసే వాతావరణం ఏర్పడింది.

గాంధీ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే తంతు. గాంధీ ఆస్పత్రిలో చేరిన నర్సు ఒకరు సర్వీస్ రిజిస్టర్ కోసం క్లర్కును సంప్రదిస్తే రెండు వేల రూపాయలు డిమాండ్ చేశారు. ఆ డబ్బును కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్‌కు గూగుల్ పే ద్వారా బదిలీ చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. దాదాపు కొత్త నర్సులందరికీ ఇదే అనుభవం ఎదురైంది.

కొద్దిమంది రూ. 1500 ఇస్తామని, మరికొద్దిమంది ప్రస్తుతం వెయ్యి మాత్రమే గూగుల్ పే ద్వారా ఇస్తామని, మిగిలింది జీతం వచ్చిన తర్వాత ఇస్తామంటూ బతిమాలుకున్నారు. సర్వీసు రిజిస్టర్‌లో పేరు ఎక్కించుకోవడంతో పాటు ఆ రిజిస్టర్‌ను కూడా నర్సులే కొని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. లంచం ఇవ్వకపోతే ఎస్సార్ ఓపెన్ కాదనే భయంతో ముడుపులు చెల్లించుకోక తప్పలేదు.

Tags:    

Similar News