చిన్న చిన్న జాగ్రత్తలతో కరోనాను నియంత్రించొచ్చు: ఎస్పీ

దిశ, మహబూబ్‌నగర్: వ్యక్తిగత, పరిసరాల శుభ్రత, సామాజిక దూరం పాటించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చునని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. కంటికి కనిపించని మహమ్మారితో పోరాడుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమకు తాము, కుటుంబానికి, సమాజానికి రక్షణ కల్పించే సైనికుల్లా నిలవాలని పిలుపునిచ్చారు. పోలీసు శాఖకు చెందిన 55 వాహనాలను సానిటైజ్ చేసే కార్యక్రమాన్ని హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శుభ్రత అనేది మన […]

Update: 2020-05-01 03:09 GMT

దిశ, మహబూబ్‌నగర్: వ్యక్తిగత, పరిసరాల శుభ్రత, సామాజిక దూరం పాటించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చునని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. కంటికి కనిపించని మహమ్మారితో పోరాడుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమకు తాము, కుటుంబానికి, సమాజానికి రక్షణ కల్పించే సైనికుల్లా నిలవాలని పిలుపునిచ్చారు. పోలీసు శాఖకు చెందిన 55 వాహనాలను సానిటైజ్ చేసే కార్యక్రమాన్ని హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శుభ్రత అనేది మన జీవితంలో తప్పనిసరిగా అలవాటు కావాలనీ, మనం వాడే వస్తువులు, వాహనాలు ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు మన దరి చేరవని సూచించారు. పోలీసు శాఖకు చెందిన 55 వాహనాలను అత్యంత నాణ్యమైన రీతిలో సానిటైజ్ చేసేందుకు ఆటోమోటవిల్ అస్సాం సంస్థ ప్రతినిధి, స్థానిక కిరాణా మర్చంట్ అధ్యక్షుడు సంబు లక్ష్మణ్ ముందుకు రావడం సంతోషకరమనీ, పోలీసు కష్టాలను గుర్తించి సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతతో ఉంటామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, డీఎస్పీ సాయి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

tags : cleaned, police vehicles, sanitizer, sp rema rajeshwari, coronavirus

Tags:    

Similar News