నీరుగారుతున్న లక్ష్యం.. అద్దెకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

దిశ, వాజేడు: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం పక్కదారి పడుతోంది. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అధికారుల తప్పిదం మూలంగా పేదలకు దక్కకుండా పోతోంది. అధికార పార్టీ అండదండలు ఉన్న వ్యక్తులకే పైరవీల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తాజాగా.. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మవరం గ్రామంలో నిర్మించిన డబుల్ ఇల్లు మంజూరు చేయకుండా.. ప్రభుత్వ ఉద్యోగులకు అద్దెకు ఇచ్చి వేలాది రూపాయలు […]

Update: 2021-04-05 22:26 GMT

దిశ, వాజేడు: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం పక్కదారి పడుతోంది. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అధికారుల తప్పిదం మూలంగా పేదలకు దక్కకుండా పోతోంది. అధికార పార్టీ అండదండలు ఉన్న వ్యక్తులకే పైరవీల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తాజాగా.. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మవరం గ్రామంలో నిర్మించిన డబుల్ ఇల్లు మంజూరు చేయకుండా.. ప్రభుత్వ ఉద్యోగులకు అద్దెకు ఇచ్చి వేలాది రూపాయలు రెంటును ఆర్జిస్తున్నారు. దీంతో అసలైన లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి, ప్రభుత్వ లక్ష్యాన్ని అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News