ఓపెన్ ఛాలెంజ్.. మాస్క్ తయారుచేస్తే రూ.3 కోట్లు మీకే

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వచ్చిన దగ్గర నుంచి మాస్కుల వాడకం తప్పనిసరి అయింది. పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ప్రతిఒక్కరూ బయటికి వస్తే మాత్రం తప్పనిసరిగా ఒక మాస్కును తమ వెంట ఉంచుకుంటున్నారు. కొంతమంది ఇంటి నుంచి కాలు బయటకు పెడితే తప్పనిసరిగా మాస్కు ధరిస్తుండగా.. మరికొంతమంది మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కరోనా ప్రతాపం పెరుగుతున్న క్రమంలో మాస్కుల వినియోగం పెరుగుతోంది. కానీ, ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న మాస్కులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఊపిరి తీసుకోవడానికి […]

Update: 2021-04-06 21:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వచ్చిన దగ్గర నుంచి మాస్కుల వాడకం తప్పనిసరి అయింది. పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ప్రతిఒక్కరూ బయటికి వస్తే మాత్రం తప్పనిసరిగా ఒక మాస్కును తమ వెంట ఉంచుకుంటున్నారు. కొంతమంది ఇంటి నుంచి కాలు బయటకు పెడితే తప్పనిసరిగా మాస్కు ధరిస్తుండగా.. మరికొంతమంది మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కరోనా ప్రతాపం పెరుగుతున్న క్రమంలో మాస్కుల వినియోగం పెరుగుతోంది.

కానీ, ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న మాస్కులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండటంతో పాటు శ్వాస వదులుతున్న సమయంలో ఆవిరి కళ్లజోడుపై చేరుకుని మసకబారుతున్నాయి. కళ్లజోడు వాడేవారికి ఇది ఒక సమస్యగా మారిపోయింది. దీంతో అలాంటి సమస్యల వల్ల చాలామంది మాస్కు ధరించడం లేదు.

ఆ సమస్యల పరిష్కారం కోసం BARDA అనే సంస్థ ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనే సంస్థతో కలిసి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. ధరించడానికి సౌకర్యవంతంగా ఉండే మాస్కులు తయారుచేసినవారికి ఏకంగా రూ.3 కోట్ల బహుబతి ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది.

తయారుచేసే మాస్కులు చాలా తక్కువ ధరలోనే ఉండాలి.ప్రజలకు నచ్చేలా ఉండాలి. ఈ పోటీలో రెండు దశలు ఉంటాయి. తొలి దశలో మాస్క్ డిజైన్ రూపొందించాలి. బాగా డిజైన్ చేసినవారిలో 10 మందిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఈ 10 మంది తమ మాస్కు గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాస్కును తయారుచేసి టెస్టింగ్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 10 మంది నుంచి మాస్కు బాగా తయారుచేసిన 5 మంది ఎంపిక చేస్తారు. ఈ ఐదుగురికి రూ.3 కోట్లు ఇస్తారు. తొలి దశ పోటీకి ఏప్రిల్ 21లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News