జడ్చర్ల ఇటుక బట్టీల్లో ఒడిశా కార్మికులు బందీ.. మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు
శ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇటుక బట్టీల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు బందీలుగా మారారు. దాదాపు 15 మంది కార్మికులను బందీ చేసిన ఇటుకల బట్టీ వ్యాపారి వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు సమాచారం. బతుకుదెరువు కోసం ఎక్కడికెక్కడి నుంచో వచ్చి ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలు తెలంగాణలో అష్టకష్టాలు పడుతున్నారు. వెట్టి చాకిరీ చేయించుకునే యజమానుల ఆగడాలకు విలవిల్లాడిపోతున్నారు. కనీస వేతనం కూడా ఇవ్వకుండా వారిని ఇటుక బట్టీ వ్యాపారులు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఈ […]
శ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇటుక బట్టీల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు బందీలుగా మారారు. దాదాపు 15 మంది కార్మికులను బందీ చేసిన ఇటుకల బట్టీ వ్యాపారి వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు సమాచారం. బతుకుదెరువు కోసం ఎక్కడికెక్కడి నుంచో వచ్చి ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలు తెలంగాణలో అష్టకష్టాలు పడుతున్నారు. వెట్టి చాకిరీ చేయించుకునే యజమానుల ఆగడాలకు విలవిల్లాడిపోతున్నారు. కనీస వేతనం కూడా ఇవ్వకుండా వారిని ఇటుక బట్టీ వ్యాపారులు చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఈ ఘటన జడ్చర్ల మండలం మాచారంలో వెలుగుజూసింది. ఈ విషయం తెలిసిన ఒడిశా రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.