ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పంజా విసురుతున్న క్రమంలో అన్ని రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ విధించగా.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలు పరీక్షలను రద్దు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులకు మార్కులు ఇస్తామని కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక మిగతా […]

Update: 2021-04-21 04:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పంజా విసురుతున్న క్రమంలో అన్ని రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ విధించగా.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలు పరీక్షలను రద్దు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇంటర్నల్ మార్కుల ఆధారంగా సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులకు మార్కులు ఇస్తామని కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇక మిగతా రాష్ట్రాలు కూడా బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి.

ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఒడిశా ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా విద్యార్థులకు మార్కులు ఇస్తామని ప్రకటించింది.

Tags:    

Similar News