ఏ.ఓ.బి.వివాద ప్రాంతంలో ఒరిస్సా ఎమ్మెల్యే గమాంగో
దిశ-ఉత్తరాంధ్ర: ఏ.ఓ.బి.వివాద ప్రాంతంమైన మాణిక్యపట్నంలో ఒరిస్సా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాశరథి గమాంగో బృందం సోమవారం పర్యటించింది. ఈ పర్యటనలో అక్కడ ఉన్న గిరిజనులు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, విద్య, వైద్యం, విద్యార్థులకు వసతి గృహాలు, మొబైల్ నెట్వర్క్ లేక పోవడం.. ఇలా పలు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తమ దృష్టికి తీసికువచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పైనే వీళ్లంతా ఆధార పడుతున్నారని తెలిపారు. ఏపీకి ఆనుకొని ఉండటం, శాశ్వత సరిహద్దు లేక పోవడమే […]
దిశ-ఉత్తరాంధ్ర: ఏ.ఓ.బి.వివాద ప్రాంతంమైన మాణిక్యపట్నంలో ఒరిస్సా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాశరథి గమాంగో బృందం సోమవారం పర్యటించింది. ఈ పర్యటనలో అక్కడ ఉన్న గిరిజనులు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, విద్య, వైద్యం, విద్యార్థులకు వసతి గృహాలు, మొబైల్ నెట్వర్క్ లేక పోవడం.. ఇలా పలు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తమ దృష్టికి తీసికువచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పైనే వీళ్లంతా ఆధార పడుతున్నారని తెలిపారు. ఏపీకి ఆనుకొని ఉండటం, శాశ్వత సరిహద్దు లేక పోవడమే కారణమని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రా నాయకులు, అధికారులు తరుచూ తమ ఆధీనంలో ఉన్న గ్రామంలోకి ప్రవేశిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటకైనా ఒరిస్సా అధికారులు అక్కడ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు.