ఆక్టోపస్, పీతలకు లీగల్ ప్రొటెక్షన్ ?
దిశ, ఫీచర్స్ : క్షీరదాలు(పాలిచ్చేవి), క్షీరదాలు కానివి సకశేరుకాలు (వెన్నెముక కలిగినవి), అకశేరుకాలు(వెన్నెముక లేనివి) అంటూ జంతువుల్లో భిన్న రకాలున్న విషయం తెలిసిందే. వీటిల్లో సకశేరుకాలకు నొప్పి, బాధతో పాటు భావాలుండటంతో చట్ట పరిధిలో రక్షించాలని యానిమల్ వెల్ఫేర్ (సెంటియెన్స్) బిల్ చెబుతోంది. అయితే అకశేరుకాలకు అలాంటి భావాలు లేకపోవడంతో వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో ఆక్టోపస్, ఎండ్రకాయలకు కూడా లీగల్ ప్రొటెక్షన్ లభించాలని కన్జర్వేటివ్ ఎంపీ బృందం భావిస్తోంది. ఆక్టోపస్ లేదా ఎండ్రకాయల గురించి ఆలోచించినప్పుడు […]
దిశ, ఫీచర్స్ : క్షీరదాలు(పాలిచ్చేవి), క్షీరదాలు కానివి సకశేరుకాలు (వెన్నెముక కలిగినవి), అకశేరుకాలు(వెన్నెముక లేనివి) అంటూ జంతువుల్లో భిన్న రకాలున్న విషయం తెలిసిందే. వీటిల్లో సకశేరుకాలకు నొప్పి, బాధతో పాటు భావాలుండటంతో చట్ట పరిధిలో రక్షించాలని యానిమల్ వెల్ఫేర్ (సెంటియెన్స్) బిల్ చెబుతోంది. అయితే అకశేరుకాలకు అలాంటి భావాలు లేకపోవడంతో వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో ఆక్టోపస్, ఎండ్రకాయలకు కూడా లీగల్ ప్రొటెక్షన్ లభించాలని కన్జర్వేటివ్ ఎంపీ బృందం భావిస్తోంది.
ఆక్టోపస్ లేదా ఎండ్రకాయల గురించి ఆలోచించినప్పుడు వాటిని మనం సీఫుడ్‌గానే చూస్తాం కానీ కన్జర్వేటివ్ ఎంపీల బృందం మాత్రం జంతువుల మనోభావాలను గుర్తించి, రక్షించడానికి వాటిని చట్టంలో చేర్చాలని వాదిస్తుంది. అయితే ఎండ్రకాయలు, ఆక్టోపస్‌లు సంక్లిష్ట భావాలను కలిగి ఉండవని కన్జర్వేటివ్ యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ (సిఎడబ్ల్యుఎఫ్) నివేదిక పేర్కొనడంతో యానిమల్ వెల్ఫేర్ (సెంటియెన్స్) బిల్లులో వీటిని చేర్చలేదు.
మెరైన్ బయోలాజికల్ అసోసియేషన్‌లో రీసెర్చ్ అక్వేరియాన్ని నిర్వహిస్తోంది 25 ఏళ్ల సముద్ర జీవశాస్త్రవేత్త ఎమిలీ సులివన్. ఆక్టోపస్, ఎండ్రకాయలు, పీతలు, క్రేఫిష్, కటిల్ ఫిష్ వంటి అకశేరుకాల జీవితాన్ని అధ్యయనం చేసిన ఆమె, బిల్లులో వాటిని గుర్తించాలని కోరుకుంటోంది. అన్ని జంతువుల్లో భావాల స్థాయి ఒకే రీతిన ఉండదు. కచ్చితంగా జాతుల మధ్య మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆక్టోపస్‌కు సంబంధించిన కటిల్ ఫిష్ చాలా తెలివైనవి. అవి నొప్పి లేదా బాధను అనుభవించినప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో వాటి ప్రవర్తన మారుతుంది. చాలా బద్ధకంగా ఉండిపోతాయి. పీతలు, ఎండ్రకాయలతో సహా చాలా జంతువుల్లో ఇలానే జరుగుతోంది. బిల్లులో వాటిని చేర్చడం ఈ మెరైన్ జంతువులపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి సంవత్సరం UK ఫిషింగ్ నౌకాదళాలు స్క్విడ్, ఆక్టోపస్, పీతలు, ఎండ్రకాయలు వంటి 420 మిలియన్లకు పైగా జాతులను కనుగొన్నాయి. ఇవి అకశేరుకాలైన కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆక్టోపస్, స్క్విడ్లతో సహా శాస్త్రీయ పరిశోధనలో జంతువులను ఉపయోగించడంపై ఇప్పటికే నిబంధనలు ఉన్నాయి’ అని ఎమిలీ పేర్కొంది.
‘ప్రపంచంలో అత్యధిక జంతు సంక్షేమ ప్రమాణాలను కలిగి ఉన్నందుకు యూకే గర్వపడుతోంది. అన్ని జంతువుల బాధలను నివారించడానికి, వాటిని మరింత బలోపేతం చేయడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము. ఆక్టోపస్, కటిల్ ఫిష్ , స్క్విడ్ వంటి జాతుల భావాలపై ఇప్పటికే సమీక్ష జరుపుతూ.. ఫలితాలను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తుంది. నిపుణులతో కూడిన కమిటీ ఈ విషయాలను పరిశీలించి తుది నివేదిక ఇస్తుంది’ అని పర్యావరణ, ఆహార, గ్రామీణ వ్యవహారాల ప్రతినిధి తెలిపారు.