ప్రభుత్వ భూమిలో భవనం కట్టారు.. చర్యలెప్పుడు..?

దిశ, మహబూబూబాద్: మానుకోట మున్సిపల్ పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ గ్రీన్‌ ల్యాండ్ భూమి కబ్జాకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. స్థానికంగా ఉన్న 10 మంది ఓ ప్రభుత్వ ఉద్యోగికే విక్రయించిన వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణంలోని బ్యాంకు కాలనీ నందు సర్వే నెంబర్ 542, 543, 544 లలో పదేండ్ల క్రిందట 250 గజాల భూమి ఉంది. గతంలోనే గ్రామపంచాయతీ […]

Update: 2021-05-13 04:16 GMT

దిశ, మహబూబూబాద్: మానుకోట మున్సిపల్ పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ గ్రీన్‌ ల్యాండ్ భూమి కబ్జాకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. స్థానికంగా ఉన్న 10 మంది ఓ ప్రభుత్వ ఉద్యోగికే విక్రయించిన వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణంలోని బ్యాంకు కాలనీ నందు సర్వే నెంబర్ 542, 543, 544 లలో పదేండ్ల క్రిందట 250 గజాల భూమి ఉంది. గతంలోనే గ్రామపంచాయతీ అధికారులు ఆ భూమిని గార్డెన్‌కు కేటాయిస్తూ రికార్డు నమోదు చేశారు.

అదే భూమిపై సదరు ఉద్యోగి ఇంటి నెంబర్ కోసం 2016లో మున్సిపాలిటీ అధికారులకు దరఖాస్తు పెట్టారు. ఇదే క్రమంలో 2019లో అధికారులు అనుమతి ఇచ్చారు. అనుమతి వచ్చింది కదా అని సదరు వ్యక్తి దర్జాగా బిల్డింగ్ నిర్మాణం చేసి కోటీశ్వరుడు అయ్యాడు. ఈ వ్యవహారం కాస్తా మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డికి చేరడంతో.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తు చేశారు.

Tags:    

Similar News