బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ: ఓట్స్ దోశ
ఓట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రకరకాల డైట్స్ ఫాలో అయ్యేవాళ్ళు వారి రోజువారీ ఆహారపు అలవాట్లలో భాగంగా ఓట్స్ ని చేర్చుకుంటారు. అయితే ఓట్స్ లో రకరకాల వెరైటీస్ ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు. అందుకే ఇప్పుడు మనం ‘ఓట్స్ అడై (oats adai)’ లేదా ‘ఓట్స్ దోశ (oats dosa)’ సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. కావలసిన పదార్ధాలు ఓట్స్ -1కప్పు వాటర్ -ఒకటిన్నర కప్పు అల్లం తరుగు -1 టీ స్పూన్ […]
ఓట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రకరకాల డైట్స్ ఫాలో అయ్యేవాళ్ళు వారి రోజువారీ ఆహారపు అలవాట్లలో భాగంగా ఓట్స్ ని చేర్చుకుంటారు. అయితే ఓట్స్ లో రకరకాల వెరైటీస్ ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు. అందుకే ఇప్పుడు మనం ‘ఓట్స్ అడై (oats adai)’ లేదా ‘ఓట్స్ దోశ (oats dosa)’ సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
ఓట్స్ -1కప్పు
వాటర్ -ఒకటిన్నర కప్పు
అల్లం తరుగు -1 టీ స్పూన్
జీలకర్ర – అర టీ స్పూన్
పసుపు – పావు టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ఉప్పు -తగినంత
కొత్తిమీర తరుగు
ఒక ఉల్లిపాయ తరుగు
ఒక పచ్చిమిర్చి తరుగు
దోశలు కాల్చడానికి సరిపడా నెయ్యి లేదా నూనె
తయారీ విధానం
ముందుగా పైన చెప్పిన పదార్ధాలన్నీ ఒక బౌల్ లో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఒక అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక మిశ్రమాన్ని పలుచగా కాకుండా కొంచెం మందపాటి దోశలలాగా వేసి, నూనె లేదా నెయ్యి వేస్తూ నిదానంగా రెండువైపులా కాల్చుకోవాలి. ఎంతో రుచికరమైన ఓట్స్ దోశలు రెడీ.