ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నర్సింగ్ గ్రాడ్యుయేట్స్

దిశ ప్రతినిధి , హైదరాబాద్: త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ పట్టబధ్రుల ఎన్నికల్లో నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ పోటీ చేయనున్నట్లు తెలంగాణ నర్సింగ్ సమితి ప్రకటించింది. ఈ మేరకు నర్సింగ్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి గోవర్థన్ సోమవారం మాట్లాడుతూ… ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న నర్సులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు పరిష్కారం, రాజ్యాంగ బద్ధమైన కనీస హక్కుల సాధన కోసం ఎన్నికల బరిలో నిల్చోవడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. నర్సుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాల్లో […]

Update: 2020-10-05 08:21 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్:
త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ పట్టబధ్రుల ఎన్నికల్లో నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ పోటీ చేయనున్నట్లు తెలంగాణ నర్సింగ్ సమితి ప్రకటించింది. ఈ మేరకు నర్సింగ్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి గోవర్థన్ సోమవారం మాట్లాడుతూ… ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న నర్సులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు పరిష్కారం, రాజ్యాంగ బద్ధమైన కనీస హక్కుల సాధన కోసం ఎన్నికల బరిలో నిల్చోవడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. నర్సుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పోరాడిన,పోరాడుతున్న చరిత్ర నర్సింగ్ సమితికి ఉందన్నారు . 2021 జనవరిలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అభ్యర్థి గా , నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరికుప్పల వెంకటేష్ పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పలు నర్సింగ్ యూనియన్ లు,పారామెడికల్ యూనియన్ లు, ప్రజాసంఘాలు ఏకాభిప్రాయం తో ఈ నిర్ణయం తీసుకున్నాయని అన్నారు.

Tags:    

Similar News