5 రోజుల్లో రిటైర్మెంట్.. అంతలోనే కరోనాకు బలి

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కారణంగా రాష్ట్రంలో తొలిసారిగా ఒక నర్సు మృతిచెందారు. మరో ఐదు రోజుల్లో పదవీ విరమణ కానున్న ఈ నర్సు నగరంలోని చెస్ట్ ఆసుపత్రిలో కరోనా వార్డులో పనిచేస్తున్నారు. అయితే ఐదు రోజుల క్రితం ఆమెకు కరోనా ఇన్‌ఫెక్షన్ రావడంతో పరీక్ష చేస్తే పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆమెను ఐసోలేషన్‌లో ఉంచినా ఆ తర్వాత శ్వాసకోశ సంబంధ సమస్య రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా వెంటిలేటర్ మీద ఉన్న […]

Update: 2020-06-26 04:53 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కారణంగా రాష్ట్రంలో తొలిసారిగా ఒక నర్సు మృతిచెందారు. మరో ఐదు రోజుల్లో పదవీ విరమణ కానున్న ఈ నర్సు నగరంలోని చెస్ట్ ఆసుపత్రిలో కరోనా వార్డులో పనిచేస్తున్నారు. అయితే ఐదు రోజుల క్రితం ఆమెకు కరోనా ఇన్‌ఫెక్షన్ రావడంతో పరీక్ష చేస్తే పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆమెను ఐసోలేషన్‌లో ఉంచినా ఆ తర్వాత శ్వాసకోశ సంబంధ సమస్య రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా వెంటిలేటర్ మీద ఉన్న ఆమె చికిత్సకు కోలుకోక శుక్రవారం మధ్యాహ్నం చనిపోయారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటికే ఇద్దరు డాక్టర్లు చనిపోయారు. ఇప్పుడు నర్సు కూడా చనిపోయారు. చెస్ట్ ఆసుపత్రిలో సీనియర్ హెడ్ నర్సుగా పనిచేస్తున్న ఆమె చనిపోవడంతో తోటి నర్సుల్లో ఆందోళన నెలకొనింది. వృత్తిపట్ల నిబద్ధతగా ఉంటూ కొత్తగా ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చినవారికి ఒక పెద్ద దిక్కుగా గైడ్ చేస్తున్న ఆమె కరోనాకు బలికావడం వారిని ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురిచేసింది.

Tags:    

Similar News