ఒకేరోజు 29,429 కొత్త పాజిటివ్‌లు
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కావడంలేదు. రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా ఒకే రోజున 29,429 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ మినహా మిగిలిన ఐదు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఇప్పటివరకూ నమోదుకానంత ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 9,36,181కు చేరుకుంది. కేంద్ర […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కావడంలేదు. రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా ఒకే రోజున 29,429 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ మినహా మిగిలిన ఐదు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఇప్పటివరకూ నమోదుకానంత ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 9,36,181కు చేరుకుంది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్…లో ఈ మేరకు పేర్కొన్నా సాయంత్రానికి పలు రాష్ట్రాల్లో బులిటెన్లు విడుదల కావడంతో ఈ సంఖ్య దాదాపు తొమ్మిదిన్నర లక్షలకు చేరుకుంది.
మహారాష్ట్రలో అత్యధికంగా 6,741, తమిళనాడులో 4,526, కర్నాటకలో 2,496, ఆంధ్రప్రదేశ్‌లో 1,916, ఢిల్లీలో 1,606, తెలంగాణలో 1,597 చొప్పున నమోదయ్యాయి. ఒకే రోజున 582 మంది చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 24,309కు చేరుకుంది. కరోనా బారిన పడిన చికిత్స అనంతరం కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ సంతృప్తి వ్యక్తం చేస్తోంది.