దేశంలో మొత్తం కేసులు 11,55,191

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం 21రోజులు పడుతోంది. గతంలో ఈ సమయం 17 రోజులుగా ఉండేది. ఈ నెల ఒకటవ తేదీ నుంచి దాదాపు 5 లక్షల 70 వేల కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,148 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 11,55,191కి చేరినట్లు ఆరోగ్య శాఖ […]

Update: 2020-07-21 11:53 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం 21రోజులు పడుతోంది. గతంలో ఈ సమయం 17 రోజులుగా ఉండేది. ఈ నెల ఒకటవ తేదీ నుంచి దాదాపు 5 లక్షల 70 వేల కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,148 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 11,55,191కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి ఒక్కరోజే 587మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 28,084కు చేరింది. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 7,24,578 మంది కోలుకోగా ప్రస్తుతం 4,02,529 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 62.5 శాతంగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా ఢిల్లీలో కొద్ది రోజులుగా కొత్త కేసుల నమోదు స్థిరంగా తగ్గుముఖం పడుతోంది. ఒక్కరోజులో నమోదైన 1349 పాజిటివ్ కేసులతో కలిపి ఇక్కడ ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,25,096కు చేరింది. ఇక్కడ కొత్తగా 27కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3690 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.

మహారాష్ట్రలో ఒక్కరోజులో 8369 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,27,031కు వెళ్లింది. రాష్ట్రంలో 24గంటల్లో వైరస్ బారినపడి 246మంది చనిపోగా మొత్తం మరణాలు 12,276కి చేరాయి. తమిళనాడులో 24గంటల్లో 4965 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,80,643కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 75మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 2626కు చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు ఉన్న 50,465 కేసులకు గాను 2201మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 4944 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఒక్కరోజే 62 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 758 మంది మృత్యువాత పడ్డారు.

Tags:    

Similar News