ఇప్పట్నుంచి గ్యాస్‌బుకింగ్‌కు ఇదే నెంబర్ !

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నవంబర్ 1నుంచి గ్యాస్‌ బుకింగ్ కోసం కొత్త నెంబర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ప్రాంతాల వారీగా రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు వివిధ ఫోన్‌ నెంబర్లు ఉండగా రేపటి నుంచి 77189 55555 నెంబర్‌ ద్వారా మాత్రమే బుకింగ్ అవకాశం కల్పిస్తున్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డిప్యూటి జనరల్ మేనేజర్ రాకేశ్ కుమార్ తెలిపారు. ఈ నెంబర్ 24గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతోపాటు 75888 88824 నెంబర్‌తో వాట్సప్ ద్వారా బుకింగ్ […]

Update: 2020-10-31 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నవంబర్ 1నుంచి గ్యాస్‌ బుకింగ్ కోసం కొత్త నెంబర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ప్రాంతాల వారీగా రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు వివిధ ఫోన్‌ నెంబర్లు ఉండగా రేపటి నుంచి 77189 55555 నెంబర్‌ ద్వారా మాత్రమే బుకింగ్ అవకాశం కల్పిస్తున్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డిప్యూటి జనరల్ మేనేజర్ రాకేశ్ కుమార్ తెలిపారు. ఈ నెంబర్ 24గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీంతోపాటు 75888 88824 నెంబర్‌తో వాట్సప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని, పేటీఎం, అమెజాన్, గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివ‌రాలను https://cx.indianoil.in ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు.

Tags:    

Similar News