కరోనా కష్టాలను ప్రతిబింబించిన ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటిశ్వరులు’
దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. కరోనా వల్ల దాదాపు ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న షో అభిమానులను ఊరిస్తూనే ఉంది. తారక్ హోస్టింగ్ స్కిల్స్‌ను మరోసారి ఆస్వాదించేందుకు అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్పప్పటికీ కరోనా కారణంగా కలిసి రావడం లేదు. అయితే అలాంటి వారందరికీ ఓ చిన్న ట్రీట్ ఇచ్చిన నిర్వాహకులు.. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా […]
దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. కరోనా వల్ల దాదాపు ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న షో అభిమానులను ఊరిస్తూనే ఉంది. తారక్ హోస్టింగ్ స్కిల్స్‌ను మరోసారి ఆస్వాదించేందుకు అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్పప్పటికీ కరోనా కారణంగా కలిసి రావడం లేదు. అయితే అలాంటి వారందరికీ ఓ చిన్న ట్రీట్ ఇచ్చిన నిర్వాహకులు.. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. కరోనా కష్టాలకు ఈ రియాలిటీ షో పరిష్కారం చూపిస్తుందని, మీకు అండగా నిలబడుతుందని వివరించే ప్రయత్నం చేశారు. ‘ఇక్కడ మనీతో పాటు మనుసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీది, కల మీది.. ఆట నాది, కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ ఎన్టీఆర్ ఆహ్వానిస్తుండగా.. ప్రోమో ట్రెండింగ్‌లోకి వచ్చింది.