ఫోర్బ్స్ జాబితాలో NTPCకి చోటు..
దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వరంగ దిగ్గజ విద్యుత్ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలోని అత్యుత్తమైన కంపెనీలతో రూపొందించిన జాబితాలో ఎన్టీపీసీ ఈ ఏడాది చోటు దక్కించుకుంది. భారత ప్రభుత్వరంగ కంపెనీల్లో ఎన్టీపీసీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నట్లు స్వయంగా ఈ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉత్తమ పద్ధతులను అమలు చేయడంలో తమకు గల నిబద్దతకు ఈ గుర్తింపే నిదర్శమని వెల్లడించింది. రాబోయే […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వరంగ దిగ్గజ విద్యుత్ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలోని అత్యుత్తమైన కంపెనీలతో రూపొందించిన జాబితాలో ఎన్టీపీసీ ఈ ఏడాది చోటు దక్కించుకుంది. భారత ప్రభుత్వరంగ కంపెనీల్లో ఎన్టీపీసీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నట్లు స్వయంగా ఈ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉత్తమ పద్ధతులను అమలు చేయడంలో తమకు గల నిబద్దతకు ఈ గుర్తింపే నిదర్శమని వెల్లడించింది.
రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నత లక్ష్యాలను సాధిస్తామని తెలిపింది. ఇంటెలిజెన్స్ డిజిటలైజేషన్, ఆన్‌లైన్ శిక్షణ ద్వారా శిక్షణ పద్దతి వేలాది మంది ఉద్యోగుల జీవితాలను వెలుగులు నింపినట్లు ప్రకటించింది. మారుమూల ప్రాంతాల నుంచి కూడా సేవలను పొందడానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.