కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎన్ఎస్‌యుఐ

దిశ, న్యూస్‌బ్యూరో: డిగ్రీ విద్యార్థుల సెమిస్టర్ ఫీజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గన్‌పార్క్ దగ్గర మంగళవారం ధర్నా చేసి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యుఐ ఉపాధ్యక్షుడు మోహిద్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులకు గురై పరీక్ష ఫీజును చెల్లించలేని పరిస్థితుల్లో డిగ్రీ విద్యార్థుల ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ […]

Update: 2020-06-09 07:54 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: డిగ్రీ విద్యార్థుల సెమిస్టర్ ఫీజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గన్‌పార్క్ దగ్గర మంగళవారం ధర్నా చేసి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యుఐ ఉపాధ్యక్షుడు మోహిద్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులకు గురై పరీక్ష ఫీజును చెల్లించలేని పరిస్థితుల్లో డిగ్రీ విద్యార్థుల ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం అనుక్షణం పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తమపై కేసులు పెట్టారని, ఇలా ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా విద్యార్థులకు అండగా ఉంటామన్నారు.

Tags:    

Similar News