ఇప్పుడు ప్రపంచం ఫోకస్ ఈ బైక్స్ పైనే….

పెట్రోల్, డీజిల్​ ధరలు రోజురోజుకూ ఆకాశన్నంటుతున్నాయి. శిలాజ ఇంధనం ఇంకెంత కాలం లభిస్తాయో తెలియని పరిస్థితులు. మరోవైపు వాహనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ తో పెరుగుతున్న వాయుకాలుష్యం. వీటన్నింటికీ చెక్​ పెట్టేందుకు ఎలక్ట్రిక్ ​వాహనాలపై ప్రపంచ దేశాలు దృష్టిసారించాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత్​లో మాత్రం అవగాహన కొరవడింది. ఎలక్ట్రిక్ వాహనాలపై జనంలో క్రేజ్ పెంచేందుకు సెప్టెంబర్​9 వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ డే నిర్వహిస్తున్నారు. 2030 నాటికి ఎలక్ట్రిక్​ వాహనాలను […]

Update: 2021-02-25 12:51 GMT

పెట్రోల్, డీజిల్​ ధరలు రోజురోజుకూ ఆకాశన్నంటుతున్నాయి. శిలాజ ఇంధనం ఇంకెంత కాలం లభిస్తాయో తెలియని పరిస్థితులు. మరోవైపు వాహనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ తో పెరుగుతున్న వాయుకాలుష్యం. వీటన్నింటికీ చెక్​ పెట్టేందుకు ఎలక్ట్రిక్ ​వాహనాలపై ప్రపంచ దేశాలు దృష్టిసారించాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత్​లో మాత్రం అవగాహన కొరవడింది. ఎలక్ట్రిక్ వాహనాలపై జనంలో క్రేజ్ పెంచేందుకు సెప్టెంబర్​9 వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ డే నిర్వహిస్తున్నారు. 2030 నాటికి ఎలక్ట్రిక్​ వాహనాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ ​వాహనాల తయారీ సంస్థలకు భారీగా రాయితీలు ప్రకటిస్తోంది. ధరలు మాత్రం పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు లేకపోవడం గమనార్హం.

దిశ, గచ్చిబౌలి: ఎలక్ట్రిక్ ​వాహనాలకు డిమాండ్​ ఏర్పడింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లొచ్చు. అయితే వాహనాల రేట్లు మాత్రం భారీగానే ఉంటున్నాయి. రాయితీలు ఉన్న రేట్లు మాత్రం తగ్గడం లేదు. వాహనంలో సగం ధర బ్యాటరీలకే ఖర్చు చేయాల్సి వస్తోంది. గంటల తరబడి చార్జింగ్ కూడా సమస్యే. అయితే టెక్నాలజీ పెరుగుతుండడంతో అరగంటలోపు అదికూడా వైర్లెస్ చార్జింగ్ పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవి ఇండస్ట్రీలో టెక్నికల్ గా మార్పులు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై జనంలో క్రేజ్ పెంచేందుకు ప్రత్యేకంగా సెప్టెంబర్ 9 వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ డే పెట్టారు. ఇలా చేయడం ద్వారా ఇండస్ట్రీకి బూస్ట్ వస్తుందని అనుకుంటున్నారు. అసలు ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిస్థితి ఏంటి? దేశంలో 2030నాటికి అంతా ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయా? మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? కొంతకాలంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికిల్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. రకరకాల ఆప్షన్లతో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. కాలుష్యం తగ్గించడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ప్రపంచ దేశాలు ఫోకస్ పెడుతున్నాయి.

భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే..

ప్రపంచ దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్ట్రిక్​ వాహనాల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. వర్ధమాన దేశాల్లో ఇండస్ట్రీ గ్రోత్ ఆశించిన స్థాయిలో లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీ(ఎలక్ట్రికల్ వాహనం) గురించి జనాలకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. దీంతో ఎలక్ట్రిక్ వెహికిల్ ఇండస్ట్రీ గురించి ప్రజలందరికీ తెలిసేలా సెప్టెంబర్ 9న వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ డే గా ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ వెహికిల్స్ నే పెద్ద ఎత్తున వాడుతున్నారు. వీటితో కాలుష్యం పెరుగుతుండడం, అదే సమయంలో శిలాజ ఇంధనం ఇంకెంతకాలం వస్తాయో చెప్పలేని ఈ పరిస్థితుల్లో ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికిల్ వైపు వెళ్లాలి అన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ వాహనాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. తయారు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.

ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకం వాటిపై అవగాహన జనాల్లో ఎంత ఉందన్న విషయం పై చాలా సంస్థలు సర్వే చేశాయి. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కమర్షియల్ వెహికిల్స్ వాడే కస్టమర్లలో 53 శాతం మంది తమ తదుపరి వాహనం కొనుగోలులో ఎలక్ట్రిక్ వాహనాలను పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్నారు. అదే సమయంలో 100 శాతం మంది కస్టమర్లు తమకు ఎలక్ట్రిక్ వాహనాలు గురించి పెద్దగా తెలియదు అని చెప్పారట. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే ప్రముఖ కంపెనీలు ఈవీల తయారీపై ఫోకస్ పెట్టాయి. ఇందులో రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ కు చాలా ఖర్చు చేస్తున్నాయి. నిజానికి ఎలక్ట్రిక్ కారు, టూ వీలర్ వంటి వాటిని చార్జింగ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. దీన్ని 35 నిమిషాలకు తగ్గించారు. బ్యాటరీ కెపాసిటీని బట్టి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న విషయం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏకంగా వైర్లెస్ చార్జింగ్ కూడా చేయబోతున్నారు. హెవీ కమర్షియల్ వెహికల్స్ కు ఎలక్ట్రిక్ పవర్ తో నడిపేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు చాలా దేశాల్లో రోడ్లపైకి వచ్చేశాయి. ఊబర్ సంస్థ చాలా ప్రపంచ దేశాల్లో టాక్సీ సర్వీసులు నడిపిస్తోంది. 2030నాటికి తమ ఆధీనంలో ఉన్న వాహనాలన్నీ 100శాతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉండేటట్లు చూసుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. బ్యాటరీలను చార్జింగ్ చేయడం కంటే మార్చడం పైనే ఫోకస్ పెడుతున్నారు. చైనాకు చెందిన నియో అనే ఎలక్ట్రిక్ కార్ స్టార్ట్ అప్ కంపెనీ ఈ ఏడాది 8 లక్షల బ్యాటరీలను తమ నెట్వర్క్ ద్వారా మార్చేసింది. సోలార్ పవర్ ద్వారా బ్యాటరీ కార్లు రీచార్జ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు డీ కర్బోరైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కార్బన్ వాయువులు తగ్గించుకునేందుకు చాలా దేశాలు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటివి ప్రోత్సహిస్తున్నాయి. ఇంకోవైపు 18 వీలర్ భారీ ట్రక్కులు, కార్గో షిప్, ప్యాసింజర్స్ జెంట్స్ ను కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నడిపేలా ప్రయోగాలు జరుగుతున్నాయి.

భారత్​లో రియాక్షన్..

మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై జనంలో క్రేజ్ పెరుగుతోంది. రాత్రికి రాత్రే మొత్తం వాహన వ్యవస్థ చేంజ్ అయ్యే పరిస్థితులు మాత్రం లేవు. ఎందుకంటే ఎంత సబ్సిడీ ఇచ్చిన ధరలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. వాహనం రేటులో సగం బ్యాటరీ కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. 2019-20 లో దేశంలో 1.56 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు దేశంలో విక్రయించారు. 2019-20 లో దేశంలో ఈవీ ల అమ్మకాలు 20 శాతం పెరిగాయని, అందులో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వాహనాలు ఎక్కువ అని సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు తెచ్చేందుకు భారీ మొత్తంలో కేంద్రం ప్రణాళికలు చేస్తోంది. మన దేశంలో ఎలక్ట్రిక్ కార్లను హ్యుందాయ్, మహీంద్రా, ఎంజీఎం మోటార్ టాటా వంటి కంపెనీలు అందిస్తున్నాయి. ప్రస్తుతం చాలా రేట్లు ఉంటున్నాయి. ఒకటి రెండు కంపెనీలవి తప్ప మిగతావన్నీ రూ.20 లక్షల పైనే ఉన్నా యి. ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు ఖర్చు అయ్యేది సగం బ్యాటరీలకే. కారు ధరలో దాదాపు సగం బ్యాటరీలకే పెట్టాల్సి వస్తుంది. లీథియం బ్యాటరీలు చాలావరకు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో ధరలు దిగిరావడం లేదు. స్థానికంగా బ్యాటరీలు పెద్ద ఎత్తున తయారు చేస్తే నే ధరలు తగ్గుతాయని చెబుతున్నారు.

భారత్​లో 2030 వరకు ఎలక్ట్రిక్ వెహికిల్స్​ ఉండాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్నది వేచిచూడాలి. చార్జింగ్ స్టేషన్ల విషయంలో ఇటీవల కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 69 వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ లు టీఎస్ కోలు ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. రాష్ట్రంలోనూ ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీలో కస్టమర్లకు చాలా బెనిఫిట్స్ కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పదివేల వరకు బ్యాటరీ వాహనాలు ఉన్నట్లు అంచనా. అది కూడా ఇటీవల కాలంలోనే పెరిగాయి. రెండేళ్లలో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 23 శాతం పెరిగింది. వచ్చే ఐదారేళ్లలో వీటి సంఖ్య చాలా పెంచేం దుకు చర్యలు తీసుకుంటున్నారు. రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్, క్వాటర్లీ టాక్స్, లైఫ్ టాక్స్ లో రాయితీలు ఇవ్వడంతో జనాలను ఎలక్ట్రికల్ వాహనాల వైపు మళ్లించ వచ్చన్న ఆలోచనలో ఉన్నారు. పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News