ఢిల్లీ హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యానికి అనుమతి 

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు(hotels), క్లబ్బులు (clubs), రెస్టారెంట్ల (restaurents) లో మద్యం తాగడానికి అనుమతించింది. కానీ, బార్లు తెరవడానికి అంగీకరించలేదు. ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. కేవలం వైన్ షాపులకు మాత్రమే అనుమతించడంతో ఎక్సైజ్ ఆదాయం పెద్దగా రావడం లేదు. ఆదాయం పెంచుకోవడం కోసం రెస్టారెంట్లు, క్లబ్బుల్లో టేబుల్ దగ్గరికి, హోటళ్లలో గదులకు మద్యం సరఫరాకు అనుమతిస్తూ ఎక్సైజ్శాఖ ఉత్తర్వులు జారీ […]

Update: 2020-08-20 10:15 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు(hotels), క్లబ్బులు (clubs), రెస్టారెంట్ల (restaurents) లో మద్యం తాగడానికి అనుమతించింది. కానీ, బార్లు తెరవడానికి అంగీకరించలేదు. ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. కేవలం వైన్ షాపులకు మాత్రమే అనుమతించడంతో ఎక్సైజ్ ఆదాయం పెద్దగా రావడం లేదు. ఆదాయం పెంచుకోవడం కోసం రెస్టారెంట్లు, క్లబ్బుల్లో టేబుల్ దగ్గరికి, హోటళ్లలో గదులకు మద్యం సరఫరాకు అనుమతిస్తూ ఎక్సైజ్శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

జూన్ 8న 40 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లకు అనుమతించింది. బుధవారం నుంచి హోటళ్లకు కూడా పర్మిషన్ ఇచ్చింది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్బుల్లో మాత్రం మద్యం సరఫరాకు అనుమతించలేదు. ‘అసోం, పంజాబ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో మద్యం తాగడానికి ఇప్పటికే అనుమతించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలో మద్యం తాగడానికి అనుమతి ఇచ్చాం’ అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు.

Tags:    

Similar News