త్వరలో తెలంగాణలో కొత్త బార్లు
దిశ, వెబ్‌డెస్క్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న సమయంలో.. రాష్ట్రంలో నూతనంగా 159 బార్లను ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు వెలువడ్డాయి. కొత్త బార్ల ఓపెనింగ్‌తో ఓ వైపు మందుబాబులకు గుడ్ న్యూస్ చెబుతున్న ప్రభుత్వం.. తాగి రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరికలు చేస్తూనే ఉంది. దీనిపై ఓ వైపు చర్చలు నడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది. సర్కారు ఉత్తర్వుల […]
దిశ, వెబ్‌డెస్క్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న సమయంలో.. రాష్ట్రంలో నూతనంగా 159 బార్లను ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు వెలువడ్డాయి. కొత్త బార్ల ఓపెనింగ్‌తో ఓ వైపు మందుబాబులకు గుడ్ న్యూస్ చెబుతున్న ప్రభుత్వం.. తాగి రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరికలు చేస్తూనే ఉంది. దీనిపై ఓ వైపు చర్చలు నడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది. సర్కారు ఉత్తర్వుల ప్రకారం.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 55 కొత్త బార్లకు అనుమతి లభించింది. మిగతావి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అయితే, నోటిఫికేషన్ వచ్చిన ఈ రోజే దరఖాస్తులు ప్రారంభించడం విశేషం. ఇక దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 8న పూర్తి కానుండగా.. 10వ తేదీన ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు. కానీ, గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం మరుసటి రోజు.. ఫిబ్రవరి 11 డ్రా తీస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ తతంగం పూర్తయిన వారం రోజుల్లోనే.. ఫిబ్రవరి 17న డ్రా పొందిన వారికి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నారు.