బీఐఎస్‌లో 171 పోస్టులకు నోటిఫికేషన్‌..!

దిశ, వెబ్‎డెస్క్: బ‌్యూరో ఆఫ్ ఇండియా స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-ఏ, బీ, సీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 171 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగినవారు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. మొత్తం పోస్టులు 171 కాగా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌- 4 (లీగ‌ల్-1, ఫైనాన్స్‌-1, మార్కెటింగ్‌-1, లైబ్రెరీ-1), అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్‌-17, ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్-16, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్ (హిందీ)-1, లైబ్రెరీ అసిస్టెంట్‌-1, స్టెనోగ్రాఫ‌ర్‌-17, […]

Update: 2020-09-12 06:36 GMT

దిశ, వెబ్‎డెస్క్: బ‌్యూరో ఆఫ్ ఇండియా స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-ఏ, బీ, సీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 171 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగినవారు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది.

మొత్తం పోస్టులు 171 కాగా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌- 4 (లీగ‌ల్-1, ఫైనాన్స్‌-1, మార్కెటింగ్‌-1, లైబ్రెరీ-1), అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్‌-17, ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్-16, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్ (హిందీ)-1, లైబ్రెరీ అసిస్టెంట్‌-1, స్టెనోగ్రాఫ‌ర్‌-17, సీనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌-79, జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌-36 ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌: త‌ప్ప‌నిస‌రిగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 27 నుంచి 35 ఏళ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, టైప్‌టెస్ట్‌, ప్రాక్టిక‌ల్ స్కిల్ టెస్ట్‌, షార్ట్‌హ్యాండ్ టెస్ట్‌, టైపింగ్ స్పీడ్ టెస్ట్‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: ‌రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, మ‌హిళ‌ల‌కు ఫీజులేదు)
అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: ‌సెప్టెంబ‌ర్ 26
ఆన్‌లైన్ ఎగ్జామ్‌: న‌వంబ‌ర్ 8
వెబ్‌సైట్‌: www.bis.gov.in

Tags:    

Similar News