AP TRANSCO: ఏపీ ట్రాన్స్ కోలో కార్పొరేట్ లాయర్ పోస్టులు.. అర్హత, జీతం వివరాలివే..!

విజయవాడ(Vijayawada)లోని ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(AP Transco) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Update: 2024-11-24 14:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada)లోని ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్(AP Transco) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 05 కార్పొరేట్ లాయర్(Corporate Lawyer) పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://aptransco.gov.in/ ద్వారా డిసెంబర్ 10 లోపు ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టు పేరు, ఖాళీలు:

కార్పొరేట్ లాయర్ - 05

విద్యార్హత:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు మూడేళ్ల LLB/LLM లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ పూర్తి చేసి ఉండాలి. అలాగే నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

వయోపరిమితి లేదు.

ఎంపిక ప్రక్రియ:

విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

ప్రొఫెషనల్ ఫీజు:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,12,000 ప్రొఫెషనల్ ఫీజు చెల్లిస్తారు.

Tags:    

Similar News